Adipurush: రిలీజ్‌కు ముందే ఆదిపురుష్‌ మరో రికార్డ్‌.. సినిమాకు క్లీన్ యూ సర్టిఫికెట్

ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదరుచూస్తున్న ఆదిపురుష్‌ సినిమా రిలీజ్‌కు ముందే మరో రికార్డ్‌ సొంతం చేసుకుంది. జూన్‌ 16న ఆడియన్స్‌ ముందుకు రానున్న ఆదిపురుష్‌ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. సినిమాలో ఎలాంటి కట్స్‌ లేకుండా యూ సర్టిఫికేట్‌ ఇచ్చింది సెన్సార్‌ బోర్డ్‌.

  • Written By:
  • Publish Date - June 10, 2023 / 12:07 PM IST

Adipurush: ప్రస్తుతం ఇండియాలో అంతా కామన్‌గా ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా ఆదిపురుష్‌ అనే చెప్పాలి. ఇటు సౌత్‌లోనే కాదు, అటు నార్త్‌లో కూడా ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదరుచూస్తున్న ఆదిపురుష్‌ సినిమా రిలీజ్‌కు ముందే మరో రికార్డ్‌ సొంతం చేసుకుంది.

జూన్‌ 16న ఆడియన్స్‌ ముందుకు రానున్న ఆదిపురుష్‌ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. సినిమాలో ఎలాంటి కట్స్‌ లేకుండా యూ సర్టిఫికేట్‌ ఇచ్చింది సెన్సార్‌ బోర్డ్‌. సినిమా ఫుల్‌ రన్‌టైం 2 గంటల 59 నిమిషాలు. అంటే దాదాపు 3 గంటలు. ప్రభాస్‌ రాముడిగా కనిపిస్తున్నాడు అనగానే సినిమా మీద ఓ రేంజ్‌లో అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్‌. ఇక రీసెంట్‌గా వచ్చిన జైశ్రీరాం సాంగ్‌, టీజర్‌ తరువాత సినిమా మీద హోప్స్‌ ఆకాశానికి చేరాయి. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో ప్రతీ సీన్‌ను బ్యూటిఫుల్‌గా షూట్‌ చేశారు. ఫైట్‌ సీన్స్‌, గ్రాఫిక్స్‌ ముందుకంటే చాలా ఇంప్రూవ్‌ అయ్యాయి. టెక్నాలజీ పెరిగిన తరువాత రామాయణం సినిమా రావడం ఇదే తొలిసారి.

ఇప్పుడున్న అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో అప్పటి రామాయణ సన్నివేశాలను మరింత రియలిస్టిక్‌గా చూపించారు. ఇలాంటి సినిమా 3 గంటలు వస్తుందంటే ఆడియన్స్‌కు ఇక ఐ ఫీస్టే. ప్రస్తుతం సినిమాకు యూ సర్టిఫికేట్‌ రావడంపై ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. ఇలాంటి సినిమాకు క్లీన్‌ సర్టిఫికేట్స్‌ రావడం కామనే.. కానీ.. ఏకంగా మూడు గంటలు ఇలాంటి విజువల్‌ వండర్‌ కళ్లముందు కదలాడటం నిజంగా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఆ థ్రిల్‌ను ఎంజాయ్‌ చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మూవీ లవర్స్‌.