2 నిమిషాల 50 సెకన్లు ఉన్న ఈ సాంగ్ మొత్తం సీతారాముల చుట్టే ఉంటుంది. వనవాసంలో సీతారాముల మధ్య సీన్స్ మొదలు రావణాసురుడు సీతను తీసుకువెళ్లిన తరువాత రాముడు సీత కోసం వెతకడం అంతా సాంగ్‌లో చూపించారు. రాముడు హనుమంతిడితో సీతకు కబురు పంపడం చివరగా యుద్ధాన్ని గెలిచి సీతను చేరుకోవడం లాంటి ఇంపార్టెంట్ సీన్స్ అన్నీ ఈ సాంగ్‌లో ఉన్నాయి.
యుద్ధం అనంతరం సీతారాములు ఎదురుపడ్డప్పుడు వాళ్ల కళ్లలో కనిపించిన ఎమోషన్ సాంగ్ మొత్తానికి హైలెట్ అని చెప్పొచ్చు. సీతారాములు ప్రమేను చాటిచెప్పే ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఇంతకు ముందు రిలీజైన జైశ్రీరాం సాంగ్‌ను మించకపోయినా.. సీతారాం సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. సాంగ్ రిలీజైన 10 నిమిషాల్లోనే లక్షన్నరకు పైగా వ్యూస్ వచ్చాయి.
ఇక పిక్చరైజేషన్ పరంగా సీతారాం సాంగ్‌లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు మేకర్స్. సాంగ్‌లో క్యారెక్టర్స్ అన్నీ చాలా నేచురల్‌గా కనిపించాయి. ముఖ్యంగా ప్రభాస్ కృతి సనన్ మధ్య ఉన్న సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఈ సాంగ్‌తో సినిమా మీద అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఆదిపురుష్ నుంచి ఫస్ట్ ట్రైలర్ రిలీజైనప్పుడు ఓ రేంజ్‌లో ట్రోలింగ్ వచ్చింది. సినిమాలో క్యారెక్టర్స్ అన్నీ కార్టూన్ బొమ్మల్లా ఉన్నాయంటూ నెటిజన్లు మండిపడ్డారు. నిజానికి ఆ క్యారెక్టర్లన్నీ అలాగే ఉన్నాయి కూడా. ఆ తరువాత రిలీజైన పోస్టర్ కూడా తీవ్రమైన ట్రోలింగ్‌కు గురైంది.
ఆ తరువాత మళ్లీ స్పెషల్ బడ్జెట్‌తో సినిమాను తీర్చిదిద్దాడు ఓం రౌత్. హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుడి పోస్టర్ రిలీజ్ చేశాడు. ఆ పోస్టర్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తరువాత నుంచి ఆదిపురుష్ వస్తున్న ట్రైలర్స్, పోస్టర్స్ అన్నీ నేచురల్‌గా ఉంటున్నాయి. ఫ్యాన్స్ కూడా వాటిని అంతే రేంజ్‌లో ఆదరిస్తున్నారు. ఇక రీసెంట్‌గా వచ్చిన జైశ్రీరాం సాంగ్ సినిమాను వేరే లెవెల్‌కు తీసుకువెళ్లింది. అప్పటి వరకూ ఓం రౌత్‌ను ట్రోల్ చేసినవాళ్లంతా జైశ్రీరాం సాంగ్ రిలీజయ్యాక డైరెక్టర్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు.
ఆ ఒక్క సాంగ్ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్‌ను మార్చేసింది. ఇప్పుడు మళ్లీ సీతారాం సాంగ్ కూడా సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఆదిపురుష్ సినిమా సీతారాముల వనవాసంతోనే మొదలు కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక జూన్16న థియేటర్స్‌లో రిలీజ్ కానున్న ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.