అంతా బాగుంది.. కాని అసలు ఆట జూన్ 16 న మొదలు కాబోతోంది. తెలిసిన రామాయణమే చూపించబోతున్న ఓం రౌత్, తనెలా కథ చెబుతాడు.. ఈమూవీ ఎలా ఉండబోతోందన్న ఉత్కంటపెరిగింది. ఐతే ఓపెనింగ్స్ ఈజీగా వందకోట్ల పైనే రావచ్చనే అంచనాలున్నాయి. కాని ఆతర్వాతేంటి?
అసలే సాహో మూవీ హిందీలో మాత్రమే హిట్టై, సౌత్ లో సోసోగా ఆడింది. బాహుబలి తర్వాత ప్రభాస్ ఏం చేసినా కలిసిరాదనేలా రాధేశ్యామ్ పంచ్ తో తేలింది. అందుకే పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ మార్కెట్ ని శాసించే సత్తా ఉన్నా హీరో కాబట్టి సాలిడ్ కథ పడాలి.. అలా జరక్కే ప్రభాస్ కి సాహోతో సగం సక్సెస్, రాధేశ్యామ్ తో ఫ్లాప్ పడింది. ఈసారి ఆదిపురుష్ హిట్ అయితే తప్ప లెక్కలు మారవు… అందుకే ఆదిపురుష్ రిజల్ట్ ప్రభాస్ ఫ్యూచర్ ని డిసైడ్ చేయబోతోంది.
ఎందుకంటే ఈ మూవీ కాస్త అటు ఇటైనా సలార్ ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపించొచ్చు. మారుతి మూవీ రాజా డీలక్స్ రిలీజ్ మొత్తానికే డైలామాలో పడొచ్చు. అందుకే ఆదిపురుష్ రిజల్డ్ తో చాలా సినిమాల ఫ్యూచర్ ఆధారపడిఉంది.