Adipurush: ఆదిపురుష్ మూవీ శుక్రవారం రాబోతోంది. ఆదివారం నుంచే అడ్వాన్స్ బుకింగ్ సందడి షురూ అవుతుంది. దీనికి తోడు సౌత్‌లో ఈ మూవీ తాలూకు హైపు, ఊపు చూస్తుంటే.. ఫస్ట్ డే 100 కోట్ల పైనే ఓపెనింగ్స్ వచ్చేలా ఉన్నాయి. అలాచూస్తే అన్నీమంచి శకునములే. కాని ఆదిపురుష్‌కి హిందీ వర్షన్‌తోపాటు యూఎస్ మార్కెట్‌లో పంచ్ పడేలా ఉంది.
ఆదిపురుష్ తెలుగు, కన్నడ వర్షన్‌కి భారీగా హైప్ వచ్చింది. తమిళ్, మలయాళ వర్షన్‌కి కావాల్సినంత ప్రమోషన్‌ని షురూ చేసింది సినిమా టీం. కాని ఏం చేసినా హిందీ వర్షన్ హైప్ పెరగట్లేదు. రిలీజ్‌కి ఇంకా ఐదార్రోజులే టైం ఉంది. దీనికి తోడు వసూళ్లని ప్రభావితం చేసే యూఎస్ మార్కెట్‌లో అడ్వాన్స్ బుకింగ్ గోలే లేదట. కేవలం అక్కడి తెలుగు వాళ్లు తప్ప, హిందీ వెర్షన్ టిక్కెట్ల అడ్వాన్స్ బుకిగ్ జోరు కనిపించట్లేదు. హిందీ వర్షన్‌కి హైప్ తీసుకురాడానికి ఫిల్మ్ టీం సరిగా ప్రమోట్ చేయకపోవటమే కారణంగా కనిపిస్తోంది. అసలే సాహో, రాధేశ్యామ్ లాంటి వరుస పంచ్‌లతో డీలా పడ్డ ప్రభాస్‌కి, ఆదిపురుష్ చాలా క్రూషియల్. ఇది కూడా ఫెయిలైతే పాన్ ఇండియా లెవెల్లో హ్యాట్రిక్ షాకులు తగిలే ఛాన్స్ ఉంది.
దీని ప్రభావం సలార్ బిజినెస్ మీద కూడా పడేలా ఉంది. అందుకే ఆదిపురుష్ టీం హిందీ వెర్షన్ ప్రమోసన్ కోసం ఏకంగా 100 ఇంటర్వ్యూలని సోమ, మంగళ వారాల్లో హిందీ ఛానల్స్‌కి ఇవ్వబోతున్నారు. బుధ, గురువారం యూఎస్‌లో కూడా స్పెషల్ ప్రమోషనల్ ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నారు.