వార్ 2 లో ఎన్టీఆర్ కి ప్రొడ్యూసర్ ఫిదా… ధూమ్ 4 బాంబు పేలొచ్చు…

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని ఒక్కసారి ధూమ్ లాంటి మూవీలో ఊహించుకోండి ఎలా ఉంటుందో.. నిజానికి ధూమ్1, ధూమ్2, ధూమ్ 3 ఈ మూడు సినిమాలు వచ్చిన టైంలో తెగులు సినిమాని బాలీవుడ్ పట్టించుకోలేదు. తెలుగు హీరోలంటే తెలియనట్టే ఉన్నారు.

  • Written By:
  • Publish Date - November 19, 2024 / 05:25 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని ఒక్కసారి ధూమ్ లాంటి మూవీలో ఊహించుకోండి ఎలా ఉంటుందో.. నిజానికి ధూమ్1, ధూమ్2, ధూమ్ 3 ఈ మూడు సినిమాలు వచ్చిన టైంలో తెగులు సినిమాని బాలీవుడ్ పట్టించుకోలేదు. తెలుగు హీరోలంటే తెలియనట్టే ఉన్నారు. కట్ చేస్తే 2025 నుంచి అంటే బాహుబలి నుంచి మొన్నటి దేవర వరకు, వసూళ్ల కు వణుకుతీసుకొచ్చింది టాలీవుడ్. కట్ చేస్తే ఇప్పుడు ధూమ్ 4 లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎంట్రీ కన్ఫామ్ అయ్యేలా ఉంది. ఆల్రెడీ వార్ 2 తో బాలీవుడ్ లో విలన్ గా ఎంట్రీ ఇస్తున్నాడు ఎన్టీఆర్. ఇక వార్ 2 మూవీ మేజర్ టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయ్యింది.కేవలం ప్రీ క్లైమాక్స్. క్లైమాక్స్, తోపాటు ఇంటర్వెల్ బ్యాంగ్ ఫైట్ సీన్లే మిగిలి ఉన్నాయి. ఐతే ఎన్టీఆర్ పెర్ఫామెన్స్ ని సెట్లో తన పని తనానికి ఫిదా అయిన యష్ రాజ్ బంపర్ ఆఫర్ ఇచ్చాడట. కాకపోతే ఇది కూడా వార్ 2 లాంటిదే… ఆల్రెడీ రణ్ బీర్, సూర్య అండ్ కో కాంబో లో ధూమ్ 4 మొదలౌతుందన్నారు. ఇంతలో సీన్ లోకి ఎన్టీఆర్ వచ్చాడు.. ఫ్యాన్స్ కి పూనకాలు తెచ్చేలా ఉన్నాడు…

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్, దేవర తో పాన్ ఇండియాని షేక్ చేశాక వార్ 2తో ఫస్ట్ హిందీ మూవీ చేస్తున్నాడు. కేవలం యాక్షన్ ఎపిసోడ్లు తప్ప టాకీ పార్ట్ షూటింగ్ పూర్తైంది. పాటలు, ఫైట్లు పూర్తి చేసేందుకు డిసెంబర్, జనవరి లో మూడు షెడ్యూల్స్ ప్లాన్ చేసింది ఫిల్మ్ టీం

అయితే రీసెంట్ గా వచ్చిన మార్పేంటంటే, ఈ మూవీ రషెస్, తోపాటు కొన్ని ఫైట్ సీన్లు నిర్మాత యష్ చోప్రాకి తెగ నచ్చాయట. దేవర ఎలాగైతే కామెంట్లు, ట్రోలింగ్స్ ని ఫేస్ చేసి కూడా నార్త్ ఇండియాని షేక్ చేసిందో… అలానే వార్ 2లో ఎన్టీఆర్ విలన్ అంటే కూడా కామెంట్లు, ట్రోలింగ్స్ జరిగాయి. కాని హ్రితిక్ కి ఎదురుగా విలన్ పాత్రలో ఎన్టీఆర్ మతిపోగొట్టినట్టు ఫిల్మ్ టీం రషెస్ తో ఫుల్ సాటిస్ ఫై అయ్యింది.

ఈ విషయంలోనే రేర్ గా సెట్స్ కి వచ్చే నిర్మాత యష్ చోప్రా, రెండు సార్లు సెట్స్ కి రావటం జరిగింది. ఎన్టీఆర్ , హ్రితిక్ తో కలిసి కనీసం 3 గంటలు బ్రేక్ టైంలో డిస్కర్షన్ చేయటం జరిగింది. ఇది అఫీషియల్.. కాకపోతే ఆల్రెడీ తీస్తున్న వార్ 2 విషయంలో కొత్తగా మాట్లాడానికి ఏమి లేదు..

కాబట్టే ఇది కొత్త ప్రాజెక్ట్ గురించని తెలుస్తోంది. యష్ రాజ్ బ్యానర్ లో స్పై సీరీస్ లో భాగంగా ఎలాగైతే వార్ కి సీక్వెల్ గా వార్ 2 వస్తుందో, అలానే థీఫ్ అండ్ ఛేజ్ సీరీస్ లో ధూమ్ 3 కి సీక్వెల్ ధూమ్ 4 తెరకెక్కబోతోంది. అందులో దొంగగా రణ్ బీర్ కపూర్, పోలీస్ గా అభిషేక్ కనిపించటం కన్పామ్ అయ్యింది. ఇక కామీయో రోలల్ లో ధూమ్ 2 హీరో హ్రితిక్ కనిపించటం కూడా అఫీషియల్ గా నే కన్ఫామ్ అయ్యింది

ఎటొచ్చి ఇందులో విలన్ గా తమిళ హీరో సూర్య నటిస్తాడని నెల రోజులుగా ప్రచారం జరిగింది. నిజంగానే అలాంటి చర్చలు జరిగాయి. కట్ చేస్తే ఇప్పడు సూర్య కాకుండా ఎన్టీఆర్ ని విలన్ గా తీసుకోవాలనుకుంటున్నారట. ఇదే విషయం ఎన్టీఆర్ ముందుంచితే, బాలీవుడ్ లోతనని వరుసగా విలన్ల పాత్రలు వేయించి, విలన్ గా మారుస్తారా అంటూ తారక్ జోక్ చేసినట్టు తెలుస్తోంది

కాని ఈ జోకే నిజమయ్యేలా ఉంది. వార్ 2 లో కూడా ఎన్టీఆర్ వేసేది పేరుకే విలన్ కాని, అన్నీ హీరోలక్షనాలున్న పాత్రే అని ముందే ఊహించొచ్చు.. వార్ 1 లో కూడా హ్రితిక్ విలన్ లా కనిపించి చివరికి హీరో అని ప్రూవ్ అయ్యింది. అచ్చంగా అలాంటి రోలే వార్ 2 లో ఎన్టీఆర్ వేస్తున్నాడనే అంచనాలున్నాయి. ఇక ధూమ్ 4 లో సూర్యని కాకుండా ఎన్టీఆర్ ని విలన్ గా తీసుకోవటానికి కారణం దేవర సక్సెస్ తోపాటు సూర్య కంగువా ఫ్లాప్ అవటమే అనే మరో కోణం కూడా ఉన్నట్టుంది. దేవరతో నార్త్ ఇండియా మాస్ లో ఎన్టీఆర్ కి ఫ్యాన్ బేస్ పెరగటమే కాదు, వార్ 2 రషెస్ లో ఎన్టీఆర్ పెర్ఫామెన్స్ కి నిర్మాత ఫిదా అవటం కూడా ఒక కారణమే… జనవరి 1 న ధూమ్ 4 టోటల్ కాస్ట్ అండ్ క్రూ ఎనౌన్స్ మెంట్ రాబోతోంది. అప్పుడే ఈ విషయం అఫీషియల్ గా వెల్లడిస్తారని ప్రచారం జరుగుతోంది.