కొన్ని వారాల గ్యాప్ తర్వాత మళ్లీ బాక్సాఫీస్ కళ కళ లాడుతోంది. మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అవే.. విశ్వక్ సేన్ నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘(Gangs of Godavari), కార్తికేయ (Karthikeya) ‘భజే వాయు వేగం‘ (Bhaje Vayu Veliya), ఆనంద్ దేవరకొండ ‘గం గం గణేశా‘ (Gam Gam Ganesha). ఈ చిత్రాలలో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘ పీరియడ్ టచ్ తో పొలిటికల్ థ్రిల్లర్ గా వస్తే.. ‘భజే వాయు వేగం, గం గం గణేశా‘ రెండు సినిమాలు క్రైమ్ థ్రిల్లర్స్ గా వచ్చాయి.
ఈ మూడు సినిమాల్లోని కామన్ పాయింట్ ఏంటంటే.. మూడు చిత్రాల్లోని హీరోలు అనాధలు కావడం. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘ సినిమాలో విశ్వక్ సేన్ అనాధగా పెరుగుతాడు. ఆ తర్వాత ఆ ఊరి ఎమ్మెల్యేకి నమ్మకస్తుడిగా మారి.. అతన్నే వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్యేగా మారే క్యారెక్టర్ అది.
‘భజే వాయు వేగం‘ సినిమాలో కార్తికేయ కూడా అనాధే. అతని తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుంటే.. తన తండ్రి స్నేహితుడు అతన్ని దత్తత తీసుకుంటాడు. ఇక.. ‘గం గం గణేశా‘ చిత్రంలోని హీరో కూడా అనాధే. చిల్లర దొంగతనాలు చేసుకునే హీరో.. చివరకు ఏడు కోట్లు విలువైన వజ్రాన్ని దొంగిలించడం తదనంతర పరిస్థితుల నేపథ్యంలో ‘గం గం గణేశా‘ సినిమా సాగుతోంది.