Prabhas : ఫౌజీ గా ప్రభాస్-హను రాఘవపూడి మూవీ

కల్కి’ చిత్రం తర్వాత ప్రభాస్ నుంచి రాబోయే సినిమా ‘రాజా సాబ్’. త్వరలోనే ఈ మూవీ సెట్స్ లోకి తిరిగి అడుగు పెట్టనున్నాడు ప్రభాస్. మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ హారర్ కామెడీగా తెరకెక్కుతోంది.

 

 

కల్కి’ చిత్రం తర్వాత ప్రభాస్ నుంచి రాబోయే సినిమా ‘రాజా సాబ్’. త్వరలోనే ఈ మూవీ సెట్స్ లోకి తిరిగి అడుగు పెట్టనున్నాడు ప్రభాస్. మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ హారర్ కామెడీగా తెరకెక్కుతోంది. ఇక.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందే ‘స్పిరిట్’లో పోలీసాఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ ఏడాదిలోనే ‘స్పిరిట్’ కూడా పట్టాలెక్కనుంది.

ఇంకా.. ‘కల్కి 2’, ‘సలార్ 2’ కూడా ప్రభాస్ కిట్టీలో ఉన్నాయి. ఈ సినిమాలన్నింటితో పాటు.. ప్రభాస్ నుంచి రాబోయే మరో క్రేజీ ప్రాజెక్ట్ హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందనుంది. ప్రభాస్ కోసం రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో కథ రాసుకున్నాడట హను రాఘవపూడి. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

హను రాఘవపూడి తీసిన ‘సీతారామం’ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్నందించిన విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కోసం కొన్ని ట్యూన్స్ కూడా సిద్ధం చేశారట. సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్‌డ్రాప్ తో సాగే ఈ మూవీలో బ్రిటీష్ ఇండియా సోల్జర్ గా ప్రభాస్ కనిపించనున్నాడట. ఈనేపథ్యంలోనే.. ఈ సినిమాకి ‘ఫౌజీ’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. హైదరాబాద్ సంస్థానం.. రజాకార్ల చరిత్ర కూడా ఈ కథలో ఉంటాయని తెలుస్తోంది.