Pawan Kalyan : మెగా సంతోషంలో కనిపించని అల్లు కుటుంబం

అఖండ (Akhanda) విజయం తరువాత జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. అన్నయ్య ఆశీర్వాదం కోసం చిరంజీవి (Chiranjeevi) ఇంటికి వచ్చిన సంఘటన మరిచిపోలేనిది.

 

 

అఖండ (Akhanda) విజయం తరువాత జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. అన్నయ్య ఆశీర్వాదం కోసం చిరంజీవి (Chiranjeevi) ఇంటికి వచ్చిన సంఘటన మరిచిపోలేనిది. కుటుంబ సభ్యుల ఆనందం, అభిమానులు కేరింతలు, సన్నిహితుల అభినందనలతో ఆ సంఘటన మెగా కుటుంబంలో (Mega family) ఓ మరుపురాని మధురక్షణంగా మిగిలిపోయింది. అలాంటి వేడుకలో అల్లు కుటుంబం నుంచి ఏ ఒక్కరు కనిపించక పోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆరోజు రాకపోవడానికి బిజీ నిర్మాత, బడా హీరో వారికి సమయం కుదరకపోవచ్చు అని సమర్థించిన వారు సైతం జూన్ 12న ఆలోచించారు. చరిత్ర సృష్టించే విధంగా నిలబడిన 21 స్థానాల్లో విజయదుంధుభి మోగించి, కీలక స్థానంలో కొణిదెల పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న తరుణంలో అల్లు కుటుంబం నుంచి ఏ ఒక్కరూ కనిపించలేదు. ఇది కచ్చితంగా ఆలోచించాల్సిన విషయం అని సమర్థించిన వారే చెవులు కొరుకుంటున్న ఉదంతాలు

మెగా కుటుంబం అంతా పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవ వేడుకల్లో కనిపించారు. కానీ అల్లు అర్జున్ (Allu Arjun), అల్లు శిరీష్, అల్లు బాబీ కనీసం మెగా కుటుంబంలో జరిగే వేడుకల్లో ప్రధానంగా కనిపించే అల్లు అరవింద్ కూడా కనిపించకపోవడం నిజంగా విడ్డూరం. వీటన్నింటిని మేళవిస్తే మెగాకుటుంబానికి, అల్లు కుటుంబానికి దూరం కొలవలేనంత పెరిగింది అనే వార్తలకు ఊతం ఇస్తున్నట్లే ఉంది. మెగాసంబరంలో అల్లు వారు ఎందుకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికల ప్రచారంలో అల్లు అర్జున్ వైసీపీ (YCP) ఎమ్మెల్యేకు మద్దతు ఇవ్వడమేనా? నిజం ఏంటో తెలియదు కానీ ఇరు కుటుంబాలకు గోడకట్టిన సంఘటన మాత్రం అదే అని తెలుస్తుంది.

నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిందర్ రెడ్డి (Shilpa Ravinder Reddy) కి అల్లు అర్జున్ మద్దతు ప్రకటించారు. ఆ తరువాత జనసేన ప్రధాన కార్యదర్శి మెగాబ్రదర్ కొణిదెల నాగబాబు మనవాడైనా పగవాడే అనే ట్వీట్ వేశారు. దాంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ రెచ్చిపోవడంతో నాగబాబు ట్వీట్ డిలీట్ చేశారు. గొడవ సర్ధుమనిగింది అని అందరూ అనుకున్నారు. పోలింగ్ జరిగింది, ఫలితాలు వచ్చాయి. పవన్ కల్యాణ్ విజయం గురించి దేశమంతా మాట్లాడుకుంది. అల్లు అర్జున్ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ వేశాడు తప్ప ఎక్కడా తన కుటుంబసభ్యుడు సాధించిన గొప్ప విజయాన్ని ఆయన మీడియాముఖంగా చూపించలేదు. మెగా సంబరాలకు సమయం లేదు సమర్థించదగ్గ విషయమే కానీ ప్రమాణ స్వీకారానికి ముందుగానే ప్రణాళిక వేసుకోవచ్చుకదా అనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వెలువడుతున్నాయి. ఇదిలా ఉంటే మెగా అల్లుడు సాయిధరమ్ తేజ్ సోషల్ మీడియాలో అల్లు అర్జున్, తన వైఫ్ స్నేహా రెడ్డిలను అన్ ఫాలో చేశాడు. దీంతో అసలు రెండు కుటుంబాలలో ఏం జరుగుతుంది అనే చర్చ మొదలైంది.