తేజ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా మొదటి రోజే నెగటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమా చూసిన ఆడియన్స్ అంతా దాదాపుగా నిరాశతోనే వెళ్తున్నట్టు కనిపిస్తోంది. ఈ సినిమా కథ విషయానికొస్తే.. హీరో ఒక నార్మల్ పర్సన్. హింసకు వ్యతిరేకం. ఒక చెంపమీద కొడితే ఇంకో చెంప చూపించే మనస్థత్వం. కానీ విలన్ల వల్ల పరిస్థితి మారిపోతుంది. హింస అంటేనే దూరంగా ఉండే హీరో హింసాత్మకంగా ఎలా మారాడు. విలన్స్ ఆట ఎలా కట్టించాడు అనేది మిగతా కథ.
యాక్టింగ్ విషయంలో అభిరామ్‌కు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. హీరోయిన్ గీతికా తివారి పర్ఫామెన్స్ కూడా అంతంమాత్రంగానే ఉందంటున్నారు ఆడియన్స్. ఈ సినిమాకు అంతో ఇంతో మ్యూజిక్ కాస్త సపోర్ట్‌గా నిలిచింది. తేజ, ఆర్పీ పట్నాయక్‌కు మంచి హిట్ కాంబినేషన్ అనే పేరుంది. వాళ్లిద్దరి కాంబినేషన్‌లో అప్పట్లో వచ్చిన చాలా సినిమాలు మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. ఇప్పుడు మరోసారి వాళ్ల కాంబినేషన్ రిపీట్ అయ్యింది.
అయితే ఒకప్పటి సినిమాల రేంజ్‌లో కాకపోయినా.. అసింహ సినిమాతో మ్యూజిక్ పర్వాలేదు అనిపించింది. సినిమాటోగ్రఫీ విషయంలో కూడా పెద్దగా సినిమా ఎఫెక్ట్ చూపించలేకపోయింది. ఆడియన్స్‌కు పెద్దగా ఇంట్రెస్ట్ లేని కథతో కొత్తగా అభిరామ్‌ను లాంచ్ చేసేందుకు ప్రయత్నించాడు తేజ. ఓవరాల్‌గా మొదటి సినిమాతోనే ఫ్లాప్ ఖాతాలో వేసుకున్నాడు దగ్గుబాటి వారి అబ్బాయి.