సినిమా వాళ్ళ పెళ్లి అంటే చాలు జనాలకు ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. సినిమా పరిశ్రమలో ఎవరి కాపురం అయినా కూలిపోతుంది అంటే చాలు సోషల్ మీడియాలో జనాలకు పండగ వాతావరణం. పొరపాటున వాళ్ళు ఏదైనా పోస్ట్ కాస్త అటు ఇటుగా పెడితే వాళ్ళు విడిపోయి ఇంకో పెళ్లి చేసుకునే వరకు ప్రశాంతంగా ఉండరు జనాలు. మాజీ విశ్వ సుందరి ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ విషయంలో అదే జరుగుతుంది. ఎప్పుడో 16 ఏళ్ళ క్రితం పెళ్లి చేసుకున్న ఈ జంట ఇప్పుడు విడిపోతుంది అంటూ మొదలుపెట్టారు.
ఐశ్వర్య రాయ్ ఎవరో తన చిన్న నాటి ఫ్రెండ్ తో కలిసి కనపడిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. తన క్లోజ్ ఫ్రెండ్ అయిన డాక్టర్ జిరాక్ మార్కర్ తో ఆమె ఒక ఈవెంట్ లో కాస్త క్లోజ్ గా కనిపించారు. వాళ్ళు ఎప్పటి నుంచొ స్నేహితులు అయినా ఇప్పుడు కాస్త ఎక్కువ క్లోజ్ గా ఉన్నారు. ఆమె ఆయనకు ముద్దులు కూడా పెట్టింది. ఆ ఫోటోలు, వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అంతే… ఇప్పుడు ఈ ఇద్దరు వివాహం చేసుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
ఈ ఇద్దరి మధ్య ఏం లేదని చెప్తున్నా కచ్చితంగా ఆ ఇద్దరి మధ్య ఏదో ఉందని, వాళ్ళు కచ్చితంగా పెళ్లి చేసుకుంటారు అని, అభిషేక్ బచ్చన్ కు విడాకులు ఇవ్వడానికి ఐశ్వర్య సిద్దం అయింది అంటూ జనాలు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఇద్దరూ కాలేజి డేస్ నుంచి ఫ్రెండ్స్. ఆయన కూడా తన భార్యకు ప్రస్తుతం దూరంగా ఉన్నారు. అందుకే ఈ ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారు అంటూ జనాలు చెప్పడం మొదలుపెట్టారు. ఇక ఐశ్వర్య ఇటీవల తన కూతురు తో కలిసి విదేశాలకు వెళ్ళిన సంగతి తెలిసిందే. అప్పుడు అభిషేక్ ఆమెతో లేకపోవడం వారి ప్రచారానికి మరింత ఊపు ఇచ్చింది.