Aishwarya Abhishek’s divorce : ఐశ్వర్య అభిషేక్‌ గ్రే డివోర్స్‌ ?

ఐశ్వర్య (Aishwarya) అభిషేక్‌ (Abhishek) విడాకుల వార్తలు (Divorce news) చాలా రోజుల నుంచి ఇంటర్నెట్‌ (Internet) లో సెన్సేషన్‌ అవుతూనే ఉన్నాయి.

 

 

ఐశ్వర్య (Aishwarya) అభిషేక్‌ (Abhishek) విడాకుల వార్తలు (Divorce news) చాలా రోజుల నుంచి ఇంటర్నెట్‌ (Internet) లో సెన్సేషన్‌ అవుతూనే ఉన్నాయి. వాళ్లిద్దరూ విడిపోతున్నారంటూ వాళ్లు వీళ్లు చెప్పడం తప్పితే ఇద్దరూ అధికారికంగా ఎంలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ చెప్పకుండానే చాలా విషయాల్లో హింట్‌ ఇచ్చేశారు. రీసెంట్‌గా అనంత్‌ అంబానీ పెళ్లికి ఇద్దరూ వేరువేరుగా రావడంతో ఇద్దరూ విడిపోయారనే వార్త మళ్లీ తెరమీదకు వచ్చింది. రీసెంట్‌గా గ్రే డివోర్స్‌ (Gray Divorce) సంబంధించిన ఓ పోస్ట్‌ను అభిషేక్‌ బచ్చన్‌ (Abhishek Bachchan) లైక్‌ చేయడంతో.. వీళ్లు విడాకులు తీసుకున్నారు అని చాలా మంది కన్ఫాం చేసేశారు. దీంతోపాటే ఇప్పుడు గ్రే డివోర్స్‌ కాన్సెప్ట్‌ కూడా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అసలు ఏంటి ఈ గ్రే డివోర్స్‌ అని చాలా మంది చర్చించుకుంటున్నారు. కారణం ఏదైనా కావొచ్చు.. కానీ చాలా కాలం నుంచి డివోర్స్‌ అనేది సినీ ఇండస్ట్రీలో చాలా కామన్‌గా మారిపోయింది.

సినిమాలు రిలీజ్‌ చేసినంత సింపుల్‌గా చాలా మంది డివోర్స్‌ (Divorce) తీసుకుంటున్నారు. పెళ్లి చేసుకుని కొంత కాలానికే విడిపోయేవాళ్లు కొందరైతే.. 10-15 ఏళ్లు కాపురం చేసి పిల్లలు ఉన్నా విడిపోయేవాళ్లు మరి కొందరు. కపుల్స్‌గా వాళ్లు విడిపోయినా పిల్లల ఆలనా పాలనా మాత్రం కలిసే చూసుకుంటున్నారు. ఇలాంటి డివోర్స్‌నే గ్రే డివోర్స్‌ అని పిలుస్తారు. కేవలం సినీ ఇండస్ట్రీ (Film industry) లోనే కాదు. కామన్‌ పీపుల్‌లో కూడా ఇప్పుడు ఈ గ్రే డివోర్స్‌ సర్వసాధారణంగా కనిపిస్తోంది. మనదేశంలో ఇది ఇటీవల ఎక్కువైనప్పటికీ విదేశాల్లో మాత్రం సర్వసాధారణం. పెళ్లైన కొత్తలోనే కాకుండా కాస్త ఏజ్‌ పెరిగాక తీసుకునే విడాకులను గ్రే డివోర్స్ అంటారు. సాధారణంగా 40 ఏళ్ల తర్వాత జుట్టు రంగు మారిపోతుంది. అందుకే జుట్టుతో పోల్చి గ్రే డైవోర్స్ అని పేరు పెట్టారు. దీన్నే డైమండ్ డివోర్స్‌ అని కూడా అంటారు.

ఈ డివోర్స్ లో పిల్లలు బాధ్యతలు కాని.. వారి ఆనందాలు కాని ఏం మిస్ కానివ్వరు. కానీ భార్యా, భర్తలుగా విడిపోతారు. ఈ వయసులో విడాకుల ప్రయోజనం వేరు. సామాజిక, మానసిక ఒత్తిడి, అవిశ్వాసం ఇలాటి డివోర్స్‌కు ప్రధాన కారణం. విడాకులు పిల్లల జీవితాలను ప్రభావితం చేస్తాయి కాబట్టి జంటలు కలిసి జీవించవలసి వస్తుంది. పిల్లలు స్వతంత్ర జీవితాన్ని ప్రారంభించిన తర్వాత, జంట విడిపోవాలని నిర్ణయించుకుంటారు. నిజానికి విడాకుల వల్ల పిల్లలు డిస్టర్బ్ అవ్వకుండా ఉంటారు. ఇది పూర్తి సేఫ్. పిల్లలు ఎవరితో నచ్చితే వారితో ఉండొచ్చు. ఇలా గ్రే డివోర్స్‌ తీసుకున్నారు కాబట్టే అభిషేక్‌ వాళ్ల పేరెంట్స్‌తో.. ఐశ్వర్య తన కూతురితో ఫంక్షన్‌కు వచ్చిందని అంతా పోస్ట్‌లు పెడుతున్నారు.