AJITH: సేమ్‌ టూ సేమ్‌.. మళ్లీ అదే డైరెక్టర్.. అదే కాంబో..!

ఈ ఇద్దరు కలిసి ఇప్పటి వరకూ 4 సినిమాలు చేస్తే నాలుగు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఇందులో వీరమ్, వేదాళమ్ ట్రెండ్ బెండ్ తీస్తే వివేగమ్, విశ్వాసం ఫ్యాన్స్‌ని ఓ రేంజ్‌లో ఎంటర్టైన్ చేశాయి. ఇప్పుడు ఇదే కాంబో మరోసారి రిపీట్ కాబోతోంది. దీంతో తెగ ఖుషీ అవుతున్నారు అజిత్ ఫ్యాన్స్.

  • Written By:
  • Publish Date - October 22, 2023 / 03:14 PM IST

AJITH: తమిళ్ హీరోలు, దర్శకుల మధ్య ఉన్న ఈక్వేషన్స్ ఎవ్వరికీ అర్ధం కావు. ఒక్క హిట్ ఇస్తే చాలు ఆ డైరెక్టర్‌ని పదే పదే రిపీట్ చేస్తారు అక్కడి హీరోలు. ఇదే లాజిక్‌తో ఒకే హీరోతో 4 సినిమాలు చేసి హిట్ కొట్టిన ఓ డైరెక్టర్ ఇప్పుడు అదే హీరోతో ఐదో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఫిల్మ్ ఇండస్ట్రీలో హిట్ కాంబోస్‌కి ఫుల్ డిమాండ్ ఉంటుంది. వాళ్ల నుంచి పదే పదే సినిమాలు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటారు. అలాంటి ఒక రేర్ కాంబో అజిత్ కుమార్, దర్శకుడు శివది.

ఈ ఇద్దరు కలిసి ఇప్పటి వరకూ 4 సినిమాలు చేస్తే నాలుగు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఇందులో వీరమ్, వేదాళమ్ ట్రెండ్ బెండ్ తీస్తే వివేగమ్, విశ్వాసం ఫ్యాన్స్‌ని ఓ రేంజ్‌లో ఎంటర్టైన్ చేశాయి. ఇప్పుడు ఇదే కాంబో మరోసారి రిపీట్ కాబోతోంది. దీంతో తెగ ఖుషీ అవుతున్నారు అజిత్ ఫ్యాన్స్. ఈ ఏడాది తునివుతో ఆడియన్స్ ముందుకు వచ్చిన అజిత్.. ఇప్పుడు మగిళ్ తిరుమేని డైరెక్షన్‌లో ‘విడాముయర్చి’ అనే మూవీ చేస్తున్నాడు. రీసెంట్‌గా సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు సూర్యతో ‘కంగువ’ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నాడు శివ. ఇది కూడా వచ్చే ఏడాది ప్రథమార్థంలో రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాలు పూర్తైన తర్వాత అజిత్-శివ కాంబోలో 5వ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందట.

దీనికి కూడా వి సెంటిమెంట్‌ రిపీట్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అంటే.. టైటిల్ వితో మొదలవుతుంది. మొదటి నాలుగు సినిమాలతో ఆడియన్స్‌ని థ్రిల్ చేసిన ఈ కాంబో ఈసారి ఎలాంటి కాన్సెప్ట్‌తో మ్యాజిక్ చేస్తుందో చూడాలి.