Akash Puri : ఆకాశ్ పూరీ పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలుసా..?

యంగ్ హీరోలు అందరూ పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ అనుభవిస్తున్నారు. ఏజ్ బార్ అవుతున్నా సరే కొందరు మాత్రం అలాగే ఉండిపోతున్నారు. కానీ జూనియర్ హీరోలు మాత్రం ఏజ్ ముదరక ముందే పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో ఎక్కువగా లవ్ మ్యారేజీలే జరుగుతున్నాయి. ఇక తాజాగా మరో యంగ్ హీరో కూడా ప్రేమ వివాహం చేసుకునేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ అతను ఎవరో క కాదండోయ్ ఆకాశ్ పూరీ.

ఆకాష్ పూరీ.. పూరీ జగన్నాథ్ కొడుకు.. మెహబూబా సినిమా హీరో.. ఈ మాత్రం ఇంట్రడక్షన్ చాలు ..ఆకాష్ ఎవరో తెలీడానికి.. యాక్టింగ్ స్కిల్స్ ఉన్నా.. సరైన కథ పడక సైలెంట్ గా ఉన్న యంగ్ హీరో. ఎన్నిసార్లు టాలెంట్ కాదు కదా..అదృష్టం కూడా కలిసి రావాలి. ప్రస్తుతం ఆకాష్ కొత్త సినిమా అనౌన్స్ చేయలేదు. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించారు. పూరిజగన్నాథ్ సినిమాల స్టైల్ వేరు.. ఆయన డైరెక్షన్ లో వచ్చిన సినిమాలు యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించిన ఆకాష్ పూరి జగన్నాథ్ సినిమాలు చేస్తున్నాడు. రొమాంటిక్, చోర్ బజార్ లాంటి సినిమాల్లో నటించాడు.

ఇదిలా ఉంటే ఆకాష్ పూరి త్వరలో పెళ్లిపీటలెక్కనున్నాడని తెలుస్తోంది. ఆకాష్ తన చిన్ననాటి స్నేహితురాలిని ప్రేమిస్తున్నాడని త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లితో ఒకటి కాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో వీళ్ల నిశ్చితార్థం-పెళ్లి ఉండబోతున్నాయని.. దీని పై క్లారిటీ ఇవ్వనున్నారని టాక్. ఇక్కడి వరకు ఇండస్ట్రీ మాటలయితే..పెద్ద పెద్ద హీరోలే పెళ్లి మాట ఎత్తడం లేదు.. ఆకాష్ కి అప్పుడే పెళ్లా అంటున్నారు నెటిజన్లు. ఆకాష్ చేసుకోబోయే అమ్మాయి వాళ్ళ తాత పెద్ద రాజకీయ నాయకుడు అని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ఆకాష్ కాని పూరీ సార్ కాని క్లారిటీ ఇవ్వాలి . లేదంటే ఈ వార్త భూచక్రం లా తిరిగి తిరిగి తెగ వైరల్ అయిపోతది మరి.