Salaar : సలార్ లో ప్రభాస్ తమ్ముడిగా అఖిల్..!

ప్రభాస్ (Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్ (Prashant Neil) దర్శకత్వంలో రెండు పార్టులుగా తెరకెక్కిన చిత్రం 'సలార్' (Salaar). మొదటి భాగం 'సీజ్ ఫైర్' గత నెలలో రిలీజయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.

ప్రభాస్ (Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్ (Prashant Neil) దర్శకత్వంలో రెండు పార్టులుగా తెరకెక్కిన చిత్రం ‘సలార్’ (Salaar). మొదటి భాగం ‘సీజ్ ఫైర్’ గత నెలలో రిలీజయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. దీంతో సెకండ్ పార్ట్ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఆ మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. అని ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా ఈ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకోగా… ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

రికార్డులతో రికార్డులు సృష్టిస్తున్న సలార్ సెలబ్రేషన్స్ (Salar Celebrations) లో ఓ యంగ్ హీరో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. వేడుకల్లో అక్కినేని అఖిల్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. ఈ సక్సెస్ పార్టీకి సంబంధించిన వీడియోని మూవీ టీం నిన్న రిలీజ్ చేసింది. ఈ వీడియోలో అక్కినేని అఖిల్ కనిపించారు. ఇక అది గమనించిన ఆడియన్స్ అసలు అఖిల్ సలార్ టీంతో ఏం చేస్తున్నారని ప్రశ్నలు వేయడం మొదలు పెట్టారు. కొంతమంది అయితే దాని వెనుక రీజన్స్ ని కూడా వాళ్లే వెతికి మరి అందరికి తెలియజేస్తున్నారు.

సలార్ సినిమాలో ప్రభాస్ చిన్నతనంలోనే తన తల్లి బేబీ బంప్‌తో ప్రెగ్నెంట్ గా ఉన్నట్లు ఒక సీన్ లో కనిపిస్తుంది. ఆ సీన్ ని చూపిస్తూ.. సినిమాలో ప్రభాస్ కి తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు పాత్రని అఖిల్ పోషిస్తున్నాడు అంటూ పలువురు నెటిజెన్స్ తమ వెర్షన్ కథలను వినిపించేస్తున్నారు. మరి ఈ నెటిజెన్స్ అంచనాలు ఎంత వరకు నిజమో తెలియదు గాని ప్రస్తుతం ఈ విషయం మాత్రం నెట్టింట వైరల్ గా మారింది.