పాట బ్యాలెన్స్ వున్నా.. ఏజెంట్ 28న రిలీజ్ రావడం గ్యారెంటీ. అవసరమైతే.. తీయాల్సిన పాట లేకుండానే రిలీజ్ చేస్తారు. మరోవైపు ఇదే రోజు వస్తున్న ps2 ట్రైలర్‌ను రిలీజ్ చేయడంతోపాటు.. క్యారెక్టర్స్‌ను పరిచయం చేస్తూ.. వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. కానీ.. ఇదే రోజు వచ్చే ఏజెంట్ మాత్రం ప్రమోషన్ వెనుకపడిపోయాడు.
28న రావాలా? వద్దా అన్న కన్‌ఫ్యూజన్ నుంచి బైట కొచ్చిన నిర్మాతలు రిలీజ్ డేట్ మరోసారి ప్రకటించడంతోపాటు.. ఇంటర్వ్యూస్ మొదలుపెట్టారు. అఖిల్‌ను, సుమ ఇంటర్వ్యూ చేసే స్టిల్స్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇక రిలీజ్‌కు 20 రోజులు మాత్రమే వుంది. ఈ తక్కువ టైంలో.. నార్త్, సౌత్ అన్న తేడా లేకుండా తిరిగేసి.. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలి. కెరీర్‌లో ఇంతవరకు హిట్ లేని అఖిల్‌కు ఏజెంట్ సక్సెస్ చాలా అవసరం. అసలు విషయం ఏమిటంటే ఏజెంట్ మూవీ 60 శాతం రీ షూట్ చేశారట. దీంతో నిర్మాత మొత్తం ఆవిరి ఐపోయాడు. పేరుకి పాన్ ఇండియా అంటున్నారు కానీ ప్రమోషన్ కూడా కష్టమే నట. నాగార్జున గోల పడలేక మళ్ళీ షూటింగ్ చేసి చేతులు కాల్చుకున్నారు. ఇంతా చేసి మూవీ జనానికి ఎక్కక పోతే ఏంటి పరిస్థితి?