AKKINENI AKHIL: అఖిల్ ఇప్పట్లో మళ్లీ రాడా? అఖిల్ నెక్స్ట్ ఏంటి?

ఏజెంట్ దెబ్బకి ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇంత వరకు అఫీషియల్‌గా అఖిల్ నెక్ట్స్ మూవీ ఏంటన్నది ఎనౌన్స్ చేయలేదు. కానీ, దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా.. శ్రీకాంత్ అడ్డాలతో ఓ ప్యామిలీ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది.

  • Written By:
  • Publish Date - January 21, 2024 / 02:31 PM IST

AKKINENI AKHIL: హీరో ఎవరైనా ప్లాప్ పడితే షార్ట్ గ్యాప్ తీసుకుంటారు. 6 నెలల్లో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హిట్ కొట్టేందుకు ట్రై చేస్తాడు. కానీ ఈ విషయంలో సైలెంట్ అయిన అఖిల్ లాంగ్ గ్యాప్‌నే కంటిన్యూ చేస్తున్నాడు. కొత్త ఏడాదిలో కూడా నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై అప్డేట్ ఇవ్వడం లేదు. అఖిల్‌.. టాలీవుడ్‌లో ఇప్పటి వరకు 5 సినిమాలు చేస్తే.. ఒక్కటి కూడా బ్లాక్ బస్టర్ కాలేదు. లాస్ట్ ఇయర్ వచ్చిన ఏజెంట్ తన కెరీర్‌ని బౌన్స్ బ్యాక్ చేస్తుంది అనుకుంటే డిఫెన్స్‌లో పడేసింది.

HANUMAN: మాట నిలబెట్టుకున్న హనుమాన్‌.. అయోధ్యకు ఎంతిచ్చారంటే…

ఆ సినిమా యావరేజ్ అయినా ఈపాటికి కొత్త సినిమా మొదలుపెట్టేవాడు. కానీ ఏజెంట్ దెబ్బకి ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇంత వరకు అఫీషియల్‌గా అఖిల్ నెక్ట్స్ మూవీ ఏంటన్నది ఎనౌన్స్ చేయలేదు. కానీ, దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా.. శ్రీకాంత్ అడ్డాలతో ఓ ప్యామిలీ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఏది ఫైనల్ కాలేదు. అఖిల్ లిస్ట్‌లో ఇప్పుడు ఓ కొత్త దర్శకుడు చేరాడు. రాధేశ్యామ్ సినిమాకు డైరెక్షన్‌ టీమ్‌లో వర్క్‌ చేసిన అనిల్ కుమార్ కెప్టెన్సీలో అఖిల్ నెక్ట్స్ మూవీ చేయబోతున్నాడు అన్నది నయా అప్‌డేట్‌. యువి క్రియేషన్స్ నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్ వచ్చే సమ్మర్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే కథ రెడీ అయింది.

ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. నాగార్జున ఫైనల్ నెరేషన్ విన్నాక టోటల్ ప్రాజెక్ట్ లాక్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. ఈసారి టార్గెట్ మిస్ అవ్వకూడదని అఖిల్ గట్టిగా కష్టపడుతున్నాడు. మరి వంద కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కే ఈ ప్రాజెక్ట్ అఖిల్‌కి ఎలాంటి క్రేజ్ తెచ్చి పెడితుందో చూడాలి.