Akkineni Family: ఫ్లాపుల్లో ముగ్గురు మొనగాళ్లే..

అక్కినేని మన్మథులు ముగ్గురు ఫ్లాపులతో పోటీ పడుతున్నారు. ఒకరి కంటే ఒకరు పెద్ద ప్లాపులు పట్టేస్తూ దూసుకెళుతున్నారు. విచిత్రంగా ఇదేదో ఫ్యామిలీ ప్యాకేజ్ లా నాగార్జున, నాగచైతన్య, అఖిల్ అంతా డిజాస్టర్లతోనే క్యూలు కట్టేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - May 13, 2023 / 04:54 PM IST

నాగార్జున పరిస్థితి మరీ దారుణం.. తను హిట్ మొహం చూసి ఏళ్లు గడుస్తోంది. ఆఫీసర్, మన్మథుడు 2, ది ఘోస్ట్, వైల్డ్ డాగ్ ఇలా ఒకదాన్ని మించి మరోటి ప్లాపు. అఖిల్ కెరీర్ బిగినింగ్ నుంచి ఏదో పొడిచేస్తాడనుకునేలోపు ఫ్లాపుతో డీలా పడుతున్నాడు. ఏజెంట్ తో అయితే మంచు ఫ్యామిలీని మించేలా ట్రోలింగ్ ఫేస్ చేశాడు.

నాగచైతన్య ఒక హిట్టు రెండుమూడు ఫ్లాపులు మధ్యలో యావరేజ్ అంటూ సంసార పక్షంగా పర్లేదనిపించుకుంటున్నాడు. కాని ఈమధ్య వరుసగా తనకి కూడా డిజాస్టర్లు పెరిగాయి. థ్యాంక్యూ పోయింది. లాల్ సింగ్ చడ్డాలో ఏదో ప్రయోగం చేస్తే డిజాస్టర్ ని ఆమిర్ ఖాన్ తో కలిసి షేర్ చేసుకోవాల్సి వచ్చింది. కస్టడీ దుమ్ముదులిపేస్తుందనుకుంటే, ఇది మరీ రాడ్ రంబోలా అంటూ కామెంట్లు పెంచారు. ఏదేమైనా కథలు ఎంచుకోవటంతో అక్కినేని ముగ్గురు మొనగాల్లు ఫేయిల్ అవుతున్నారు.