తెలుగు సినిమా పరిశ్రమలో తొలి హీరో… అక్కినేని నాగేశ్వరరావు. సినిమా పరిశ్రమలో అత్యంత బలమైన కుటుంబం, ధనిక కుటుంబం కూడా. రాజకీయ నాయకులతో మంచి సంబంధాలు, దేశ వ్యాప్తంగా వ్యాపారాలు ఇలా కంప్లీట్ సక్సెస్. కాని కాని… అక్కినేని ఫ్యామిలీకి ఉన్న బాధ ఏంటీ అంటే… ఇప్పటి వరకు ఆ ఫ్యామిలీ హీరోల్లో ఒక్కరికి కూడా వంద కోట్లు రాలేదు సినిమాకు. సినిమాల్లో చక్రం తిప్పిన కుటుంబానికి ఈ పరిస్థితి చూసి ఫ్యాన్స్ కూడా బాధ పడుతున్నారు. ఆ ఫ్యామిలీ సినిమాలు ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు పోతున్నాయో కూడా తెలియదు.
కాని ఫ్యామిలీ మాత్రం వార్తల్లో ఏదోక రూపంలో ఉంటుంది అనే మాట వాస్తవం. ఈ మధ్య కాలంలో మీడియాలో అక్కినేని ఫ్యామిలీ గురించి వార్తలు బాగానే వస్తున్నాయి. హైడ్రా దెబ్బకు అక్కినేని ఫ్యామిలీ భయపడింది. ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా అధికారులు కూల్చేశారు. ఆ కూల్చివేత దెబ్బకు వేరే వారిలో కూడా వణుకు పుట్టింది. ఇక ఇప్పుడు కొండా సురేఖ… కేటిఆర్ పై చేసిన విమర్శల కారణంగా అక్కినేని ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తోంది. సమంతా నాగ చైతన్య విడాకుల వెనుక కేటిఆర్ ఉన్నాడని ఫోన్ ట్యాపింగ్ ఉందని ఆమె ఆరోపణలు చేసారు.
దీనిపై నాగార్జున పరువు నష్టం కేసు వేసారు. ఆమెను అసలు వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేసారు. ఆ కేసు వేసిన రెండో రోజున… నాగార్జున పై తుమ్మిడి కుంట ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ కట్టారు అని కేసు పెట్టారు. అయితే తనపై సురేఖ చేసిన వ్యాఖ్యలకు గానూ నాగార్జున వంద కోట్ల పరువు నష్టం దావా వేస్తామని చెప్పినట్టు ప్రచారం జరిగింది. ఒకవేళ కోర్ట్ ఆ విషయంలో సురేఖకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే మాత్రం ఆమె కట్టాల్సి ఉంటుంది. అదే జరిగితే అక్కినేని ఫ్యామిలీ వంద కోట్ల షేర్ సాధించినట్టే అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. మరి ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.