Akkineni: కొత్త ప్రియురాలితో అడ్డంగా దొరికిపోయిన నాగ చైతన్య

నాగచైతన్య శోభితా ధూళిపాళ్ల మరోసారి దొరికిపోయారు. ఇంతకాలం సాక్ష్యాలు వున్నా తప్పించుకున్నారు. అయితే ఈసారి బలమైన సాక్ష్యంతో వీళ్లిద్దరి ఎఫైర్‌ బైటపడింది. ఓ అజ్ఞాతవ్యక్తి వీళ్లిద్దరి లవ్‌ స్టోరీని బైటపెట్టాడు.

  • Written By:
  • Publish Date - March 29, 2023 / 11:40 AM IST

సమంతతో విడిపోయాక చైతు శోభితా ధూళిపాళ్లతో డేటింగ్‌లో వున్నాడరంటూ వార్తలు వస్తూనే వున్నాయి. లాల్‌సింగ్‌ చద్దా రిలీజ్‌ టైమ్‌లో నేషనల్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శోభిత ప్రస్తావన రాగా.. చెప్పలేక స్మైల్‌ ఇచ్చి ఊరుకున్నాడు. రాపిడ్‌ ఫైర్‌లో భాగంగా ఒక్కొక్కరి అడుగుతూ.. శోభిత ధూళిపాళ్ల పేరు వినగానే మీకు గుర్తుకువచ్చేది ఏమంటని అడగ్గా..చైతు నవ్వేశారు. జస్ట్‌ నవ్వుతాను అని బదిలిచ్చాడు. ఎఫైర్‌ వుంది కాబట్టే.. లేదని చెప్పలేక..ఇలా చేశాడంటూ.. నెటిజన్లు కామెంట్స్‌ చేశారు.

లేటెస్ట్‌ ఫొటో చూశాక నెటిజన్లు ఆగుతారా. ఈ ఇద్దరి ఎఫైర్‌ను కన్ఫర్మ్‌ చేసేశారు. ఫిబ్రవరిలోనే లండన్‌లో డిన్నర్‌ డేట్‌కు వెళ్లిన ఫొటో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్కడి చెఫ్‌ సురేందర్‌ మోహన్‌ నాగచైతన్యతో ఫొటో దిగారు. వెనకాల శోభిత కూర్చుకుని కనిపించింది. చెఫ్‌ షేర్‌ చేసిన ఈ ఫొటో వైరల్‌ కావడమే కాదు… ఎఫైర్‌కు సాక్ష్యం దొరికింది.. వీళ్లిద్దరూ దొరికిపోయారు అంటూ ట్రోలింగ్‌ చేస్తున్నారు.

ఇలా దొరికిపోతామని ఈజంట ఊహించి వుండదు. ఎప్పటికైనా తెలియాల్సిందే కదా.. ఇలా తెలిసిందిలే అని ఊపిరిపీల్చుకుంటారేమోగానీ.. ఈ ఫొటో బైటకొచ్చాక రకరకాల కథలు పుట్టుకొచ్చాయి. రీసెంట్‌గా చైతు కొత్త ఇంటికి కూడా శోభిత వచ్చిందని… అసలు కొత్త ప్రియురాలి కోసమే కొత్త ఇల్లు కొన్నాడంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. గూఢచారితో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ తెలుగమ్మాయి… ఆతర్వాత మేజర్‌లో నటించింది. ప్రస్తుతం మంకీ మ్యాన్ అనే ఇంగ్లీష్‌ మూవీ చేస్తోంది. సమంత తో చైతు విడిపోక ముందే శోభిత ధూళిపాళ్ల తో రిలేషన్ ఉందట. సామ్ తో విడిపోదానికి అదే అసలైన కారణం. కొత్తగా ఇల్లు కట్టేసుకున్నాడు కనుక ఇక శోభిత తో ఆ ఇంటివాడు అవడమే ఆలస్యం.త్వరలో ఇద్దరిని కలిసి చూస్తామేమో.