Chiranjeevi: టాలీవుడ్‌లో మారాల్సింది చిరు, నాగార్జునే అంటున్నారు మూవీ లవర్స్. మార్పంటే వాళ్ల హీరోయిజంలో కాదు.. పాత్రల ఎన్నిక విషయంలో అనేదే ప్రధాన కంప్లైంట్. ఎందుకంటే 65 దాటి, 70లోకి అడుగుపెట్టేంతగా వయసు పెరుగుతున్నా ఇంకా, పాతికేళ్ల కుర్రాడిలా రొమాంటిక్ రోల్స్ వేయటం, రొమాంటిక్ కామెడీ చేయటం ఈ తరానికి అంతగా డైజెస్టింగ్‌గా లేదనే కామెంట్లు ఎప్పటి నుంచో వస్తున్నాయి.
ఒక వైపు భోళా శంకర్‌లో చిరు రొమాంటిక్ మాస్ కామెడీ, మరో వైపు జైలర్‌లో తాతయ్యగా రజినీ డీసెంట్ జర్నీ చూస్తే కమల్, రజినీ ఎప్పుడో మారారని తేలిపోయింది. ఇంకా చిరు ఇమేజ్ చట్రంలో ఉండిపోయి, ఇలా అయితేనే చూస్తారనుకునే భ్రమలోంచి బయటికి రావాలనే కామెంట్స్ పెరిగాయి. ఆఖరికి వెంకటేష్ కూడా దృశ్యంలో తన ఏజ్‌కి తగ్గట్టుగా అటు హీరోగా, ఇటు తండ్రిగా సరైన రూట్లో వెళ్లాడు. నారప్పలో అదే ఫాలో అయ్యాడు. ఇక బాలయ్య రీసెంట్‌గా భగవంత్ కేసరిలో హీరోయిన్ శ్రీలీల తండ్రిగా కనిపించబోతున్నాడు. సో తను కూడా మార్పుకి తగ్గట్టే ప్లోలో ఉన్నాడని తేలుతోంది. ఎటొచ్చి చిరునే ఇంకా కుర్ర హీరోల్లా రొమాంటిక్ జర్నీ చేస్తానంటేనే కుదరట్లేదు.
బ్రో డాడీ రీమేక్‌లో హీరోకి తండ్రిగా కనిపించాల్సిన చిరు.. ఇమేజ్ వల్ల, తన కొడుకు పాత్రని బ్రదర్ రోల్‌గా మార్పించాడనే కామెంట్లు కూడా పెరుగుతున్నాయి. ఈ ప్రచారాలు ఎలా ఉన్నా, నాగ్ కూడా మారాలి. తను ఎంత యంగ్ లుక్‌ని మేయింటేన్ చేసినా తన కొడుకులే రొమాంటిక్ జర్నీ చేస్తుంటే, తను వాళ్లకి పోటీ ఇవ్వటం డైజెస్టింగ్‌గా లేదనే వాదనుంది. అమితాబ్, కమల్, రజినీ, వెంకీ బాటలో నడుస్తూ, ఏజ్‌కి తగ్గరూట్లో జైలర్.. లేదంటే విక్రమ్‌లాంటి హీరోయిజాన్ని నమ్ముకుంటే బెటరనే ఉచిత సలహాలు పెరిగాయి.