Akshay Kumar: హీరో అక్షయ్‌ కుమార్‌కు భారతీయ పౌరసత్వం..

భారత పౌరసత్వాన్ని తిరిగి పొందాలని అనుకుంటున్నానని.. పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అక్షయ్‌ కుమార్‌ పలుమార్లు చెప్పారు. ఇప్పుడు అక్షయ్‌కు భారత పౌరసత్వం లభించింది. తాను కెనడా పౌరసత్వం తీసుకోవడానికి గల కారణాన్ని అక్షయ్‌ కుమార్‌ గతంలోనే వివరణ ఇచ్చాడు.

  • Written By:
  • Publish Date - August 15, 2023 / 02:06 PM IST

Akshay Kumar: పౌరసత్వం విషయంలో విమర్శలు ఎదుర్కొనే బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌కు ఎట్టకేలకు భారతీయ పౌరసత్వం లభించింది. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. నా హృదయం.. పౌరసత్వం.. రెండూ హిందుస్థానీ. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.. అంటూ పోస్ట్ చేశాడు. తనకు కెనడా పౌరసత్వం ఉందన్న విషయాన్ని అక్షయ్‌ గతంలోనే చెప్పాడు. 2019 ఎన్నికలకు ముందు ప్రధాని మోదీని అక్షయ్‌ ఇంటర్వ్యూ చేసిన సమయంలో పౌరసత్వం విషయంలో అక్షయ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి.

భారతీయులందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని అప్పట్లో కోరారు. ఐతే ఓటు హక్కు లేని వ్యక్తి భారత పౌరులకు ఓటింగ్‌ కోసం పిలుపునివ్వడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ఆయన అప్పట్లోనే వివరణ ఇచ్చారు. భారత్‌ పౌరసత్వాన్ని తిరిగి పొందాలని అనుకుంటున్నానని.. పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు పలుమార్లు చెప్పారు. ఇప్పుడు అక్షయ్‌కు భారత పౌరసత్వం లభించింది. తాను కెనడా పౌరసత్వం తీసుకోవడానికి గల కారణాన్ని అక్షయ్‌ కుమార్‌ గతంలోనే వివరణ ఇచ్చాడు. 1990ల్లో చాలా కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నానని, వరుసగా 15 సినిమాలు ఫ్లాప్ అయ్యాయని, కెనడాలో ఉన్న ఫ్రెండ్‌ సలహాతో అక్కడికి వెళ్లి పనిచేయాలని నిర్ణయించుకున్నానని, అందుకోసమే పాస్‌పోర్ట్‌కు అప్లయ్‌ చేశానని చెప్పుకొచ్చాడు.

అంతలోనే అప్పటికే నటించిన రెండు సినిమాలు భారత్‌లో ఘన విజయం సాధించడంతో అక్కడికి వెళ్లాల్సిన అవసరం రాలేదని.. ఈ ప్రాసెస్‌లో పాస్‌పోర్ట్‌ విషయం మరిచిపోయానని.. అందుకే భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నానని వివరించాడు అక్షయ్‌.