బన్నీ మాటలు ఎప్పుడూ ప్రత్యేకమే అనిపిస్తుంటాయ్. హీరో ఎవరైనా.. తన వంతుగా రియాక్ట్ అవుతుంటారు. బర్త్‌డే అయినా.. అవార్డులు వచ్చినా.. కంగ్రాట్స్ చెప్తూనే.. తన ఫీలింగ్ చెప్తూనే.. మనసులో మాట బయటపెడుతుంటాడు. ఐతే చరణ్ విషయంలో మాత్రం ఎందుకో ఇగో అడ్డు వస్తుందా బన్నీకి అనిపిస్తోంది. ఆస్కార్ రేంజ్ వరకు ట్రిపుల్‌ఆర్ వెళ్లినా రియాక్ట్ కాలేదు. ఏదో బిజీలో ఉండి అలా చేశాడులే అనుకుంటే.. చరణ్ బర్త్‌డేకు కూడా కనీసం విష్ చేయలేదు. అలా అని సోషల్ మీడియాకు మొత్తం దూరంగా ఉన్నారా అంటే.. తన 20ఇయర్స్ ఫిల్మ్‌జర్నీ గురించి పోస్ట్ చేశాడు. దీంతో చరణ్ విషయంలో కావాలని బన్నీ రియాక్ట్ కాలేదని మెగాఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.
చిరంజీవి అంటే మర్రిచెట్టులాంటోడు. చిరు ఇంటి నుంచి.. అల్లు అరవింద్ ఇంటి నుంచి ఎవరు హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చినా.. వాళ్లను మెగా ఫ్యామిలీనే అంటారు తప్ప.. ప్రత్యేకమైన గుర్తింపు లేదు. అల్లు అర్జున్‌కు ఇదే నచ్చడం లేదా అంటే.. ఇది కూడా కారణం అయి ఉండొచ్చు అనేది చాలామంది మాట. పుష్ప మూవీతో బన్నీ ప్యాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో ఇప్పుడు తనకంటూ సొంత బ్రాండ్ క్రియేట్ చేసుకునేందుకు కష్టపడుతున్నాడు. అల్లువారింటి హీరో అనిపించుకోవాలని అనుకుంటున్నాడు అనిపిస్తోంది.
అందుకే మెగా కాంపౌండ్‌కు దూరం జరుగుతున్నాడనే గుసగుసలు ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతున్నాయ్. నిజానికి మెగా కాంపౌండ్‌కు దూరం జరగడం.. ఎప్పుడో మొదలుపెట్టాడు బన్నీ! మెగా ట్యాగ్ తనకు అవసరం లేదంటూ అల్లు అర్జున్ ఆర్మీని సొంతంగా క్రియేట్ చేసుకున్నాడు. కన్నీళ్లతోనో, నవ్వుతోనో.. వేదికపైనో, ఇంటర్వ్యూలోనో.. తన ఆర్మీ గురించి చాలాసార్లు ప్రమోట్ చేశారు కూడా ! ఆ మధ్య పవన్ గురించి చెప్పను బ్రదర్ అని రచ్చ చేశాడు. అప్పుడు రియాక్ట్ అయి వివాదానికి తెరతీస్తే.. ఇప్పుడు రియాక్ట్ కాకుండా కాంట్రవర్సీకి కేరాఫ్ అయ్యాడు.
మెగా కాంపౌండ్‌కు, చరణ్‌కు బన్నీకి ఎప్పటి నుంచో దూరం పెరిగింది. చిరంజీవి అనే మహావృక్షం కింద ఎదగడం అసాధ్యం అనుకున్నాడో.. కష్టం అని తెలుసుకున్నాడో.. దూరం జరగడం మొదలుపెట్టాడు బన్నీ అనేది చాలామంది నుంచి వినిపిస్తున్న అభిప్రాయం. నిజానికి బన్నీ హీరోగా నిలదొక్కుకోవడానికి ఒకరకంగా చిరంజీవే కారణం. బన్నీ కెరీర్ మొదట్లో చిరు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ప్రత్యేక గుర్తింపు కోసమో.. తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం కోసమో.. మెగా కాంపౌండ్‌కు బన్నీ దూరం జరుగుతున్నాడు. మరి దీనిపై మెగా ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.