కొత్త టాలెంట్ ఎక్కడ ఉన్నా వెతుక్కొని వచ్చి మరీ సిల్వర్ స్క్రీన్ మీద నిలబెడుతున్నారు. హీరోలు, హీరోయినట్లు మాత్రమే కాదు.. ఎంతోమంది దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. పడిపోయిన డైరెక్టర్లను తన సంస్థ ద్వారా నిలబెట్టారు.. నిలబెడుతున్నారు కూడా ! గీతగోవిందంతో డైరెక్టర్ పరశురామ్‌కు అలాంటి లైఫే ఇచ్చాడు అరవింద్. ఈయన చేసిన సాయానికి కొడుకుకు అరవింద్ పేరు వచ్చేలా పెట్టుకున్నాడు పరుశురామ్. ఏం జరిగిందో ఏమో కానీ.. ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయ్. గీతా ఆర్ట్స్‌లో సినిమా చేయాల్సిన పరుశురామ్.. కొండబాబుతో కలిసి దిల్ రాజు కాంపౌండ్‌లో ప్రత్యక్షం అయ్యాడు. దీనిపై అప్పట్లో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఐతే ఆ తర్వాత అంతా సైలెంట్ అయినట్లు కనిపించినా.. అది కామానే తప్ప.. ఫుల్‌స్టాప్ కాదని అల్లు అరవింద్ కామెంట్‌తో ప్రూవ్ అయింది.
మళయాళి రీమేక్‌గా వచ్చిన 2018 సినిమా తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. దీన్ని గీతా ఆర్ట్స్ ద్వారానే రిలీజ్ చేశారు. ఈ సక్సెస్ పార్టీకి అల్లు అరవింద్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. కొత్త వాళ్లకు చాన్స్ ఇవ్వాలంటూ చెప్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు అల్లు అరవింద్. ఒక డైరెక్టర్‌ను ఇంకో డైరెక్ట్‌తో కంపేర్ చేస్తూ అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మంటలు రేపుతున్నాయ్. కార్తికేయ 2 డైరెక్టర్ చందూ మొండేటి గురించి ప్రస్తావించిన అరవింద్.. ఇతని టాలెంట్ నమ్మి ముందుగానే రెండు సినిమాలు బుక్ చేశానని.. గీతా ఆర్ట్స్‌లో కమిట్ కావడంతో ఎన్ని ఆఫర్లు వచ్చిన చందూ వెళ్లలేదని అన్నాడు.
అక్కడితో ఆగారా అంటే.. తన ద్వారా పైకి వచ్చిన దర్శకులు మాత్రం గీత దాటి వెళ్లి పని చేసుకున్నారంటూ.. అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మంటలు రేపుతున్నాయ్. ఇది డైరెక్టర్ పరుశురామ్‌ను ఉద్దేశించే అన్నారనే చర్చ జరుగుతోంది. నిజానికి పరుశురామ్ వరుస ఫ్లాప్‌ల్లో ఉన్నప్పుడు.. పిలిచి మరీ ఆఫర్ ఇచ్చాడు అల్లు అరవింద్. గీతగోవిందం ట్రెమండస్ హిట్ అయింది. నెక్ట్స్ ప్రాజెక్ట్ కూడా గీతా ఆర్ట్స్‌లోనే.. విజయ్ దేవరకొండతో అనుకున్నారు. ఏం జరిగిందో ఏమో కానీ.. విజయ్ దేవరకొండతో కలిసి పరుశురామ్.. దిల్ రాజు కాంపౌండ్‌లో కనిపించాడు. దీంతో అరవింద్ హర్ట్ అయ్యారని.. పరుశురామ్ మీద ఇలా కోపం తీర్చుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్ ఫిల్మ్‌నగర్ వర్గాల్లో.