Allu Arjun: పుష్ప 2లో మెగాస్టార్ అభిమానిగా కనిపించనున్న బన్నీ..

పుష్ప 2 లో బన్నీ మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా కనిపించబోతున్నాడు. కేవలం చిరు అభిమానిగానే కాదు, అమితాబ్ అభిమానిగా, రజినీకాంత్ ఫ్యాన్‌గా, మోహన్ లాల్ అభిమానిగా.. ఇలా సర్‌ప్రైజులు రెడీ చేస్తున్నాడు. పుష్ప 2 వచ్చే ఏడాది ఆగస్ట్ 15కి రిలీజ్ కాబోతోంది.

  • Written By:
  • Publish Date - October 17, 2023 / 06:59 PM IST

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. తన కట్టె కాలేవరకు మెగాస్టార్ అభిమానే అని ఎప్పుడో తేల్చాడు. మెగా హీరోల మధ్య గ్యాప్ ఉన్నా, మెగా క్యాంప్‌కి బన్నీ దూరమౌతున్నాడనే కామెంట్లు వినిపించినా.. బన్నీ స్టాండ్ మాత్రం మారలేదు. అదే విషయం పుష్ప 2తో కూడా తేలుతోంది. పుష్ప 2 లో బన్నీ మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా కనిపించబోతున్నాడు. కేవలం చిరు అభిమానిగానే కాదు, అమితాబ్ అభిమానిగా, రజినీకాంత్ ఫ్యాన్‌గా, మోహన్ లాల్ అభిమానిగా.. ఇలా సర్‌ప్రైజులు రెడీ చేస్తున్నాడు.

పుష్ప 2 వచ్చే ఏడాది ఆగస్ట్ 15కి రిలీజ్ కాబోతోంది. పాన్ ఇండియా లెవల్లో ఐదు భాషల్లో ఐదు రకాలుగా పుష్పరాజ్ పాత్రలో మార్పు కనిపించబోతోంది. తెలుగు వర్షన్‌లో మాత్రం బన్నీ చిరు ఫ్యాన్‌గా కనిపిస్తాడట. కారణం పుష్ప 2 మూవీలో 2002 టైం పీరియడ్ ఉంటుందట. అందులో చిరు అభిమానిగా బన్నీ కనిపించటమే కాదు, చిరు సినిమా పోస్టర్‌తో సీన్ కూడా తెరకెక్కించాడట సుకుమార్. సరే తెలుగు వర్షన్ అంటే చిరు ఇంద్ర పోస్టర్ వాడారు.. మెగాస్టార్ అభిమానిగా బన్నీని చూపించారు.. మరి తమిళ్ పరిస్థితేంటి? అక్కడే ట్విస్టుంది.

పుష్ప 2 తమిళ్ వర్షన్‌లో రజినీ అభిమానిగా బన్నీ కనిపించబోతున్నాడు. హిందీ వర్షన్ పుష్ప 2లో అమితాబ్ ఫ్యాన్‌గా కనిపించనున్న అల్లు అర్జున్, మలయాళం వర్షన్‌లో మాత్రం మోహన్ లాల్ ఫ్యాన్‌గా కనిపిస్తాడట.