Allunarjun : ఒకే ఫ్రేమ్‌లో అల్లు అర్జున్, అల్లు అయాన్..?

ఇటీవల కాలంలో స్టార్లతో పాటు.. స్టార్ కిడ్‌లకు కూడా విపరీతమైన క్రేజ్ పెరిగిపోతోంది. సోషల్ మీడియాలో స్టార్‌కిడ్‌లు (Star Kids) చేసే హంగామా అంతా ఇంతా కాదు.. ఈ క్రమంలోనే పలువురు స్టార్లు చేస్తున్న ప్రెస్టీజియస్ మూవీస్‌లో.. స్టార్‌ కిడ్లు కూడా కనిపించబోతున్నారన్న వార్తలు ఫ్యాన్స్‌ను ఆనందంలో ముంచెత్తుతున్నాయి.

 

ఇటీవల కాలంలో స్టార్లతో పాటు.. స్టార్ కిడ్‌లకు కూడా విపరీతమైన క్రేజ్ పెరిగిపోతోంది. సోషల్ మీడియాలో స్టార్‌కిడ్‌లు (Star Kids) చేసే హంగామా అంతా ఇంతా కాదు.. ఈ క్రమంలోనే పలువురు స్టార్లు చేస్తున్న ప్రెస్టీజియస్ మూవీస్‌లో.. స్టార్‌ కిడ్లు కూడా కనిపించబోతున్నారన్న వార్తలు ఫ్యాన్స్‌ను ఆనందంలో ముంచెత్తుతున్నాయి. నిన్నటి వరకు మహేశ్‌-రాజమౌళి సినిమాలో.. మహేశ్ (Mahesh) గారాలపట్టి సితార ఎంట్రీ ఇవ్వబోతుందన్న వార్త సోషల్ మీడియాను షేక్ చేయగా.. ఇప్పుడు రీసెంట్‌గా అల్లు అర్జున్ (Allu Arjun) వారసుడు కూడా పుష్ప-2 (Pushpa2) ద్వారా వచ్చేస్తున్నాడన్న న్యూస్ ఫ్యాన్స్‌ను ఫుల్‌ ఖుషీ చేస్తోంది.

టాలీవుడ్‌ (Tollywood) లో అల్లు ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ వేరు.. ఇక.. అల్లు వారి అబ్బాయి బన్నీకి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. తగ్గేదేలే అంటూ పుష్ప సినిమాలో చేసిన రచ్చకు నేషనల్ అవార్డు కూడా పట్టేసాడీ స్టైలిష్ స్టార్.. పుష్ప సాధించిన ఘన విజయంతో.. పుష్ప-2పై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దీనికి తగ్గట్లుగానే డైరెక్టర్ సుకుమార్ ఆ మూవీని నెక్ట్స్ లెవెల్‌లో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా పై ఇప్పటికే ఎన్నో రూమర్లు వినిపించాయి. రీసెంట్‌గా ఇప్పుడు మరో రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ వారసుడు ‘అల్లు అయాన్’ (Allu Ayan) నటించనున్నట్లు తెలుస్తోంది. అయాన్ కోసం ‘పుష్ప-2’లో ఓ కీలక పాత్రను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ వార్తతో బన్నీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు..

కొద్ది రోజుల క్రితం బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న నటుడు అల్లు అర్జున్ ‘పుష్ప 3’ గురించి మాట్లాడారు. అయితే అక్కడి వారు అల్లు అయాన్ గురించి అడిగితే మోడల్ బోల్తే అంటూ బన్నీ చెప్పుకొచ్చాడు. కాబట్టి పుష్ప 2 లేదా పుష్ప 3 (Pushpa3) సినిమాలో అల్లు అయాన్ ఉంటాడని అప్పట్లోనే అందరూ ఫిక్సయిపోయారు. ఇప్పుడు ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కు బలం చేకూరుస్తూ సోషల్ మీడియాలో అల్లు అయాన్ ఎంట్రీ కన్‌ఫామ్ అంటూ న్యూస్ చక్కర్లు కొడుతోంది. కాగా.. ఇప్పటికే అల్లు అర్జున్ కూతురు సమంతతో కలిసి శాకుంతలం సినిమాలో నటించింది. ఇప్పుడు పుష్ప-2లో అల్లు అయాన్ కూడా ఎంట్రీ ఇచ్చేస్తే.. ఇంక తగ్గేదేముంది అంటున్నారు ఫ్యాన్స్.. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే కొద్ది కాలం ఆగాల్సిందే..