ALLU ARJUN-ATLEE: గెట్ రెడీ.. అల్లు అర్జున్‌తో అట్లీ.. త్వరలో ప్రకటన

షారుక్ ‘జవాన్‘ సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో అట్లీ సృష్టించిన కలెక్షన్ సునామీ గురించి తెలిసిందే. ‘జవాన్‘ తర్వాత అట్లీ చేయబోయే సినిమా అల్లు అర్జున్‌తోనే అనేది ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాదు కోలీవుడ్ లోనూ హాట్ టాపిక్‌గా మారింది.

  • Written By:
  • Publish Date - February 21, 2024 / 03:55 PM IST

ALLU ARJUN-ATLEE: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పీడు పెంచబోతున్నాడు. మూడేళ్లుగా ‘పుష్ప‘ గెటప్‌లోనే ఉన్న బన్నీ.. ఇకపై వరుస సినిమాలతో బిజీ అవ్వడానికి ప్లాన్ రెడీ చేస్తున్నాడు. ఇప్పటికే అల్లు అర్జున్ అఫీషియల్‌గా రెండు సినిమాలను ప్రకటించాడు. వాటిలో ఒక చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు కాగా.. మరొక సినిమాని సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్నాడు. అయితే.. వీరిద్దరి కంటే ముందే అట్లీతో సినిమాని పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నాడట బన్నీ.

Prabhas: వదలని లీకులు.. రాజా సాబ్ నుంచి డైలాగ్ లీక్..!

షార్ట్ పీరియడ్‌లోనే కోలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా ఎదిగాడు అట్లీ. షారుక్ ‘జవాన్‘ సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో అట్లీ సృష్టించిన కలెక్షన్ సునామీ గురించి తెలిసిందే. ‘జవాన్‘ తర్వాత అట్లీ చేయబోయే సినిమా అల్లు అర్జున్‌తోనే అనేది ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాదు కోలీవుడ్ లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే అట్లీ.. అల్లు అర్జున్‌కి ఓ స్టోరీ చెప్పాడట. దానికి ఐకాన్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తమిళ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మించనుందని తెలుస్తోంది.

ఈ సినిమాతో సన్ పిక్చర్స్ టాలీవుడ్‌కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చే సన్నాహాల్లో ఉందట. అనిరుధ్ రవిచందర్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తాడట. త్వరలోనే అల్లు అర్జున్-అట్లీ మూవీపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.