ALLU ARJUN-ATLEE: అల్లు అర్జున్-అట్లీ.. టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్

షారుఖ్‌తో జవాన్ తీసేప్పుడు వందకోట్లు తీసుకున్న అట్లీ.. అందులో 60 కోట్లు తనకి, మిగతా 40 కోట్లు హీరోయిన్ నయనతార, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌తోపాటు సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ ఇలా అందరికి ఇచ్చాడట.

  • Written By:
  • Publish Date - April 2, 2024 / 06:37 PM IST

ALLU ARJUN-ATLEE: తగ్గేది లేదని రెండో సారి ప్రూవ్ చేసేందుకు పుష్ప రాజ్ ఆగస్ట్ 15న ముహుర్తం చూసుకున్నాడు. జూన్‌లోగా షూటింగ్ పూర్తవుతుంది. ఆతర్వాత బన్నీ నెలరోజుల వెకేషన్‌కి వెళ్లి, ఆ వెంటనే జులై నుంచి అట్లీ మూవీతో బిజీ అవుతాడు. ఇక తెరవెనక అట్లీతో అల్లు అరవింద్ చర్చలు కూడా జరిగాయి. కాని సఫలం కాలేదని తెలుస్తోంది. తమిళ్‌లో విజయ్‌తో వరుసగా బ్లాక్ బస్టర్లు తీసిన అట్లీ హిందీలో షారుక్‌తో జవాన్ తీసి వెయ్యికోట్ల వసూళ్లు రాబట్టాడు.

KALKI 2898 AD: రెబల్ స్టార్ ఫుల్ రిలాక్స్.. ఫ్యాన్స్‌కి నిరాశ తప్పదా..?

దీంతో ఫెయిల్యూర్స్ లేని దర్శకుడిగా, వంద నుంచి వెయ్యికోట్ల వసూళ్లుు రాబట్టిన డైరెక్టర్‌గా అట్లీకి మంచి డిమాండ్ ఉంది. అందుకే తను గట్టిగా డిమాండ్ చేస్తున్నాడట. షారుఖ్‌తో జవాన్ తీసేప్పుడు వందకోట్లు తీసుకున్న అట్లీ.. అందులో 60 కోట్లు తనకి, మిగతా 40 కోట్లు హీరోయిన్ నయనతార, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌తోపాటు సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ ఇలా అందరికి ఇచ్చాడట. ఇది తన స్టైల్. తను ఎవరితో మూవీ కమిటైనా, తన పేమెంట్‌తోపాటు తను చెప్పి టీం పేమెంట్స్ కూడా తన ప్యాకేజ్‌లోనే తీసుకుంటాడు. కాని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ విషయానికొచ్చేసరికి తన 100 కోట్ల ప్యాకేజిని పక్కన పెట్టి, కేవలం తన పారితోషికం 60 కోట్లిస్తే చాలు. ఇద్దరు మినహా మిగతా కాస్ట్ అండ్ క్రూ మీ ఇష్టం అన్నాడట. కాని అల్లు అరవింద్ మాత్రం ఒప్పుకోవట్లేదని తెలుస్తోంది. అనిరుధ్ డిమాండ్ చూస్తే తనకి 60 కోట్లు రెమ్యునరేషన్ అన్నాడట. అది అల్లు అరవింద్‌కి పెద్ద విషయం కాదు.

హీరోయిన్‌గా సమంత, మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ అనేది కూడా అట్లీ నిర్ణయమే. అది కూడా అల్లు అరవింద్‌కి ఇబ్బంది కాదు. కాని తమిళ్ మార్కెట్‌లో వచ్చే లాభాల్లో షేర్ అడిగాడట. అలా చూస్తే ఆట్లికి 60 కోట్ల రెమ్యునరేషన్ పోను, ప్రాఫిట్స్‌లో షేర్ లెక్కలేస్తే మరో 90 కోట్లు.. మొత్తంగా 150 కోట్ల వరకు వెళతాయట. హిందీ, తెలుగు తర్వాత పెద్ద మార్కెట్ తమిళ్‌దే. అక్కడ షేర్ డైరెక్టర్‌కిస్తే ఇక నిర్మాతకు మిగిలేదేముంది. అందుకే అల్లు అరవింద్ పూర్తిగా తప్పుకోవటమో లేదా సన్ పిక్చర్స్ నిర్మిస్తే అందులో భాగం పంచుకోవటమో చేస్తాడట. ఇలా ఏదో ఒకటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందట.