Allu Arjun: థ్రెడ్స్‌లో బన్నీ అరుదైన రికార్డు.. ఆ ఘనత దక్కించుకున్న తొలి హీరోగా సంచలనం

ఈ కొత్త సోషల్ మీడియాలో బన్నీ ఎకౌంట్ తెరిచాక ఫస్ట్ టైం వన్ మిలియన్ ఫాలోవర్స్ అయ్యారు. ఈ ప్లాట్ ఫాంలో ఇంతమంది ఫాలోవర్స్ ఉన్న ఏకైక స్టార్ హీరో బన్నీనే. సౌత్‌లోనే కాదు, ఇండియాలోనే ఈ రికార్డ్ ఎవరికీ ఇంకా సొంతం కాలేదు. 

  • Written By:
  • Updated On - July 25, 2023 / 11:43 AM IST

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా కింగ్‌గా మారాడు. క్రికెట్‌లో విరాట్ కొహ్లీ, సినిమాల్లో బన్నీ అనేంతగా సీన్ మారింది. తనకి ఇన్‌స్టాగ్రామ్‌లో 21 మిలియన్ల కంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఐతే ఇప్పుడు ఆ 21 మిలియన్లు కాదు వన్ మిలియనే ముద్దంటున్నాడు బన్నీ. ఇన్‌స్టా, ట్విట్టర్‌లానే కొత్తగా వచ్చిన సోషల్ మీడియా థ్రెడ్స్‌లో తనకి భారీగా రెస్పాన్స్ వస్తోంది. ఈ కొత్త సోషల్ మీడియాలో బన్నీ ఎకౌంట్ తెరిచాక ఫస్ట్ టైం వన్ మిలియన్ ఫాలోవర్స్ అయ్యారు. ఈ ప్లాట్ ఫాంలో ఇంతమంది ఫాలోవర్స్ ఉన్న ఏకైక స్టార్ హీరో బన్నీనే. సౌత్‌లోనే కాదు, ఇండియాలోనే ఈ రికార్డ్ ఎవరికీ ఇంకా సొంతం కాలేదు.
ఇన్‌స్టాగ్రామ్‌లో 21 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న ఏకౌక సౌత్ హీరో కూడా బన్నీయే. అలాంటి మరో రికార్డు సోషల్ మీడియా అయిన థ్రెడ్స్‌లో బన్నీ సొంతమైంది. థ్రెడ్స్‌లో వన్ మిలియన్ ఫాలోవర్స్‌తో ఇండియాలోనే వన్ అండ్ ఓన్లీ బన్నీ అనిపించుకున్నాడు ఐకాన్ స్టార్. ముందుముందు బన్నీ మరెన్ని రికార్డులు సాధిస్తాడో.