తాను తన ఫ్రెండ్స్‌కు ఎంత ప్రాముఖ్యత ఇస్తాడో చాలా ఫంక్షన్స్‌లో చెప్పాడు అల్లు అర్జున్. అయితే స్నేహితులతో ఇంత కూల్‌గా ఉండే బన్నీ.. తనతో నటించిన ఓ హీరోయిన్‌ను బ్లాక్ చేశాడట. ఆమె ఎవరో కాదు. వరుడు సినిమా హీరోయిన్ భాను మెహ్రా. వరుడు సినిమా తరువాత ఈ అమ్మడుకు పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. కొన్ని సినిమాల్లో గెస్ట్‌రోల్ అవకాశాలు వచ్చినా.. ఆ సినిమాలు కూడా పెద్దవేవీ కాదు.
ప్రస్తుతం భాను మెహ్రీ సినీ కెరియర్ చాలా స్లోగా రన్ అవుతోంది. సినిమా అవకాశాలు లేకున్నా సోషల్ మీడియాలో భాను చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన అప్‌డేట్స్, పర్సనల్ విషయాలను అభిమాననులతో పంచుకుంటుంది. దీంట్లో భాగంగానే అల్లు అర్జున్ గురించి ఓ ట్వీట్ చేసింది భాను. ఉన్నట్టుంది ట్విటర్‌లో అల్లు అర్జున్ తనను బ్లాక్ చేశాడంటూ పోస్ట్ చేసింది. కెరియర్‌లో ఎన్ని బాధలు వచ్చినా నవ్వుకుంటూ బతకడం తనకు అలవాటంటూ ట్యాగ్‌లైన్ కూడా పెట్టింది.
ఆ ట్వీట్ చేసిన కాసేపటికే తనను బన్నీ అన్‌బ్లాక్ చేశాడంటూ మరో పోస్ట్ కూడా పెట్టింది. బన్నీ చాలా గొప్ప వ్యక్తంటూ చెప్పింది. అయితే సడెన్‌గా భాను ఎందుకు ఇలాంటి పోస్ట్ పెట్టిందా అని బన్నీ ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆ అమ్మాయిని ఎందుకు బ్లాక్ చేశాడు.. మళ్లీ ఎందుకు అన్‌బ్లాక్ చేశాడంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే కొంత కాలంగా భాను ఓ ట్యూబ్ చానల్ రన్ చేస్తోంది. కుకింగ్ వీడియోస్, ట్రావెల్ వ్లాగ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ యూట్యూబ్‌లో పెడుతోంది. మీడియా ఫోకస్‌ను తనవైపు తిప్పుకునేందుకే బన్నీ గురించి ఇలాంటి పోస్ట్ పెట్టిందని కొంత మంది నెటిజన్లంటున్నారు.