అల్లు అర్జున్ విషయంలో తెలంగాణ పోలీసులు సీరియస్ గానే కనపడుతున్నారు. సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకి విషమంగా మారుతుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం అల్లు అర్జున్ పిల్లాడి చికిత్స కోసం ఆసుపత్రికి బిల్లులకు పే చేస్తున్నాడు అంటూ ప్రచారం జరిగింది. అల్లు అర్జున్ కూడా ఏం కావాలన్నా సరే ఆ పిల్లాడి కోసం చేస్తానంటూ ఒక ప్రకటన కూడా చేశాడు. అయితే తాజాగా తెలంగాణ పోలీసులు చేసిన ప్రకటనలు మాత్రం అల్లు అర్జున్ అబద్ధాలు చెప్తున్నాడని జనాలకు ఓ క్లారిటీ వచ్చింది.
ఆ పిల్లాడి వైద్య ఖర్చులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వ భరిస్తోందంటూ పోలీసులు ప్రకటన చేశారు. ఇక ఇదే టైం లో అల్లు అర్జున్ బెయిల్ ఎలాగైనా సరే రద్దు చేయించడానికి, మళ్ళీ జైల్లో వేయడానికి తెలంగాణ పోలీసులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కూడా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇక సంధ్య థియేటర్ యాజమాన్యానికి కూడా ఇప్పటికే పోలీసులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తాము ముందే హెచ్చరించినా, సంధ్య థియేటర్ యాజమాన్యం మాత్రం లెక్క చేయలేదు అంటూ పోలీసులు తమ నోటీసుల్లో పేర్కొన్నారు.
అసలు లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలి అంటూ తెలంగాణా పోలీసులు నోటీసులు ఇష్యూ చేసారు. ఇప్పుడు ఇవి సినీ పరిశ్రమలో అలజడికి సృష్టిస్తున్నాయి. ఇక అల్లు అర్జున్ ను ఎలాగైనా సరే మరోసారి అరెస్టు చేసేందుకు, అలాగే ఆయన బెయిల్ రద్దు చేసేందుకు తీవ్ర స్థాయిలో కష్టపడుతున్నారు పోలీసులు. ఇందుకోసం అవసరమైన సాక్ష్యాలు అన్నీ కూడా సేకరిస్తున్నారు. ఇప్పుడు ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషయంలో ఏం జరుగుతుంది అనే ఆందోళన కూడా చాలా మందిలో వ్యక్తం అవుతుంది.
బన్నీ ఫ్యాన్స్ అయితే ఆ చిన్నారి బ్రతకాలని పూజలు కూడా చేస్తున్నారు. సినిమా పరిశ్రమ పెద్దలు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో ఈ విషయంలో చర్చలు జరుపుతున్నారని… కాస్త వెనక్కు తగ్గాలని కోరుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే అల్లు అర్జున్ మాత్రం ఈ విషయంలో సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేయాలని భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. తన క్వాష్ పిటిషన్ హైకోర్టులో విచారణ జరిగిన నేపథ్యంలో ఇక సుప్రీంకోర్టులో కూడా ఈ అంశంపై పిటిషన్ వేసేందుకు అల్లు అర్జున్ రెడీ అవుతున్నాడు. తెలంగాణ పోలీసులు పట్టుదలగా ఉండటంతో బన్నీ కూడా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది. నాంపల్లి కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించిన తర్వాత తెలంగాణ హైకోర్టు మద్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత నుంచి పరిణామాలు అన్నీ కూడా ఆసక్తికరంగా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అల్లు అర్జున్ విషయంలో సీరియస్ గానే ఉన్నారు.