రెబల్ స్టార్ సెట్ చేసిన ట్రెండ్, పుష్ప 2లో ఫాలో, మరీ ఓవర్ గా…

ఒకప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ల విషయంలో చిన్న చూపు ఉండేది. సైడ్ క్యారెక్టర్ కు ఉన్న హైప్ కూడా హీరోయిన్ కు ఉండేది కాదు. విలన్ కు కాస్తో కూస్తో హైప్ ఉండేది... హీరోయిన్ ఏదో తప్పక సినిమాలో ఆ రోల్ చేసినట్టే సీన్స్ ఉండేవి.

  • Written By:
  • Publish Date - November 18, 2024 / 08:44 PM IST

ఒకప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ల విషయంలో చిన్న చూపు ఉండేది. సైడ్ క్యారెక్టర్ కు ఉన్న హైప్ కూడా హీరోయిన్ కు ఉండేది కాదు. విలన్ కు కాస్తో కూస్తో హైప్ ఉండేది… హీరోయిన్ ఏదో తప్పక సినిమాలో ఆ రోల్ చేసినట్టే సీన్స్ ఉండేవి. కాని ఇప్పుడు సీన్ మారుతోంది. హీరోయిన్ ఇగో కూడా సాటిస్ఫి చేయడం స్టార్ట్ చేసారు మన డైరెక్టర్లు హీరోలు. ఒకప్పుడు హీరో అంటే హీరోలానే ఉండాలి… ఎక్కడా తగ్గకూడదు అన్నట్టు బిహేవ్ చేసేవారు మన స్టార్ హీరోలు. చిన్న హీరోలు కూడా అదే కంటిన్యూ చేసారు.

హీరోయిన్ ను కాళ్ళ దగ్గర కూర్చోబెట్టడమే గాని హీరోయిన్ కాళ్ళ దగ్గర కూర్చున్న సీన్స్ మన టాలీవుడ్ సినిమాల్లో చాలా తక్కువ. కాని ఈ విషయంలో రెబల్ స్టార్ ప్రభాస్ ఓ ట్రెండ్ సెట్ చేసాడు. మిర్చీ సినిమాలో ఓ సాంగ్ లో అనుష్క కాలు పట్టుకున్న సీన్ పిచ్చ పిచ్చగా ఫ్యాన్స్ కు నచ్చేసింది. ఆడియన్స్ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. ప్రభాస్ కు ఉన్న ఇమేజ్ కు హీరోయిన్ కాలు పట్టుకోవడం ఏంటీ అని కొందరు మాట్లాడినా ఆ సీన్ బాగా వర్కౌట్ అయింది. ఇక ఆ తర్వాత శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు కూడా కంటిన్యూ చేసాడు.

ఓ సాంగ్ లో శ్రుతీ హాసన్ కాలు పట్టుకుంటాడు. అది కూడా ఆడియన్స్ కు బాగానే నచ్చింది. ఇక ఆ తర్వాత యంగ్ హీరో అఖిల్… పూజ హెగ్డే కాలు సోఫాలో కూర్చుని భుజంపై పెట్టుకుంటాడు. సినిమా హిట్ కాకపోయినా ఈ సీన్ కు మంచి మార్కులు పడ్డాయి. పూజ కోసం ఆ సీన్ ను జూమ్ చేసి చూసారు జనాలు. ఓ సినిమాలో రవితేజా… మీసాలను హీరోయిన్ కాలుతో తిప్పే సీన్ కు జనాలు ఫిదా అయిపోయారు. కాలు పట్టుకోవడం ఓకే గాని ముఖం వరకు ఆ కాలు రావడం మాత్రం కచ్చితంగా జనాలకు బాగా నచ్చింది.

దీనిపై సోషల్ మీడియాలో చాలా కామెంట్స్ వచ్చాయి. బెడ్ రూమ్ లో జరిగే సీన్ ను సినిమాలో పెట్టేసారు అంటూ కామెంట్ చేసారు. ఇక గేమ్ చేంజర్ సినిమాలో కూడా కైరా అద్వాని కాలు పట్టుకునే సీన్ ఉంటుంది. ఇప్పుడు పుష్పలో వాటికి మించి… తగ్గేదేలే అనే పుష్ప మేనరిజంను శ్రీవల్లి కాలుతో చెప్పించాడు డైరెక్టర్ సుక్కు. ఈ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో పిచ్చ పిచ్చగా వైరల్ అవుతోంది. బన్నీకి గట్స్ ఉండాలని కొందరు… కాదు స్నేహ రెడ్డి ఒప్పుకోవడం గొప్పతనం అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.