Pushpa 2: యష్, చరణ్‌కి వచ్చిన కష్టాలు వద్దనే.. బన్నీ పుష్ప-3 ప్లానింగ్?

మొన్నటి వరకు పుష్ప-3 అంటే.. బాహుబలి-3, ట్రిపులార్-2 లానే ఓ పెద్ద జోక్ అనుకున్నారు. కాని ఇప్పుడు లెక్కలు మారాయి. ఐతే బన్నీ మాత్రం పుష్ప-3 కోసం పట్టుబడుతున్నాడు. అందుకు సాలిడ్ రీజనుంది. పుష్ప-1 హిట్ కాబట్టి సీక్వెల్ కూడా హిట్టయ్యే ఛాన్స్ ఉంది.

  • Written By:
  • Publish Date - April 20, 2023 / 04:59 PM IST

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనకి ఇప్పుడప్పుడే పాన్ ఇండియా కష్టాలు వద్దనుకుంటున్నాడు. యష్, చరణ్‌కి ఎదురైన కష్టాలను తాను ఫేస్ చేయకూడదు అనుకుంటున్నాడు. అందుకే పుష్ప-3 కోసం గట్టిగా పట్టుబడుతున్నాడట. సుకుమార్ కూడా సరే అన్నాడట. మొన్నటి వరకు పుష్ప-3 అంటే.. బాహుబలి-3, ట్రిపులార్-2 లానే ఓ పెద్ద జోక్ అనుకున్నారు. కాని ఇప్పుడు లెక్కలు మారాయి.

ఐతే బన్నీ మాత్రం పుష్ప-3 కోసం పట్టుబడుతున్నాడు. అందుకు సాలిడ్ రీజనుంది. పుష్ప-1 హిట్ కాబట్టి సీక్వెల్ కూడా హిట్టయ్యే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత ఏంటంటే మరో కొత్త పాన్ ఇండియా మూవీ చేయాలి. అంటే మళ్లీ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌తో, ఎన్టీఆర్ కొరటాల శివ మూవీతో ఎలా అదృష్టం పరీక్షించుకుంటున్నారో అలానే బన్నీ కూడా మరో పాన్ ఇండియా మూవీతో రిస్క్ చేయాలి. అందుకోసం సందీప్ రెడ్డి వంగ మూవీకి సై అన్నాడు. అయితే, పుష్ప సీక్వెల్ తర్వాత వచ్చే మూవీస్ ఫ్లాపైనా లేదా ఆలస్యమైనా తర్వాత ఏంటి అనే సందేహం వచ్చింది.

అంటే యష్‌లా సరైన సినిమా లేకుండా ఎక్కువ కాలం ఖాళీగా ఉండటం లేదా బాహుబలి సక్సెస్ తర్వాత ప్రభాస్ చేసిన సాహోలాంటి ఫ్లాప్ ఎదరైతే పరిస్థితి ఎలా అని బన్నీ ఆలోచించాడు. అందుకే కలిసొచ్చిన పుష్ప మూడో సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు. అంటే పుష్ప సీక్వెల్ తర్వాత చేసే పాన్ ఇండియా మూవీ ఫ్లాప్ అయినా.. వెంటనే పుష్ప-3 చేస్తే తన మార్కెట్ పదిలమవుతుందని బన్నీ లెక్కలేశాడట. అందుకే ఇప్పుడు పుష్ప-3 చేయడం దాదాపు కన్ఫాం అయింది.