మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య విభేదాలు దాదాపుగా మూడు నాలుగేళ్ల నుంచి తీవ్ర స్థాయిలో నడుస్తున్నాయి అనే విషయం స్పష్టత ఉంది. అల్లు అర్జున్ సినిమా ఈవెంట్స్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేస్తున్న హడావుడి అల్లు అర్జున్ కు మెగా ఫ్యామిలీకి మధ్య గ్యాప్ తీసుకొచ్చింది అనే విషయం పై చాలా మందికి క్లారిటీ ఉంది. మెగా ఫ్యామిలీ ఇమేజ్ నుంచి తను బయటకు రావాలి అని అల్లు అర్జున్ తీవ్రంగా కష్టపడుతూ పుష్ప రెండు సినిమాల విషయంలోనూ జాగ్రత్తగా ముందుకు వెళ్లాడు. సోలోగా ఈ రెండు సినిమాల సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు అల్లు అర్జున్.
మెగా ఇమేజ్ లేకుండా సినిమాలు భారీ వసూళ్లు సాధించాలి అని చాలా ఆశలు పెట్టుకున్నాడు. అందుకే నార్త్ లో ప్రమోషన్స్ చాలా గ్రాండ్ గా చేసాడు. తెలుగులో అసలు మెగా ఫ్యామిలీ నుంచి చిన్న సపోర్ట్ కూడా తీసుకోలేదు. మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు చిరంజీవిని కలిసినా అల్లు అర్జున్ మాత్రం కలవలేదు. తనకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అలాగే వైసిపి కార్యకర్తలు అండగా ఉంటే కచ్చితంగా సినిమా భారీ వసూళ్లను సాధిస్తుందని అంచనా వేసినా అనుకున్న విధంగా ఫలితం కనపడలేదు.
దీనితో అల్లు అర్జున్ ఇప్పుడు కాస్త డీలా పడినట్టుగా తెలుస్తోంది. అందుకే రీసెంట్ గా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ప్రభుత్వాలకు ధన్యవాదాలు చెబుతూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కళ్యాణ్ బాబాయ్ అంటూ సంబోధించాడు అల్లు అర్జున్. దీనితో అల్లు అర్జున్ పై సీరియస్ గా ఉన్న మెగా అభిమానులు అలాగే జనసేన కార్యకర్తలు కాస్త కూలయ్యారు. ఇదే సమయంలో వైసీపీ కార్యకర్తలు అల్లు అర్జున్ పై సీరియస్ గా ఉన్నారనే విషయం సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ చూస్తుంటే అర్థమవుతుంది.
అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో అల్లు అర్జున్ అంత జాగ్రత్త పడటానికి కారణం గోదావరి జిల్లాలో అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మెగా అభిమానులు భారీగా ఉండటమే. అటు ఉత్తరాంధ్రలో కూడా మెగా అభిమానుల సంఖ్య భారీగానే ఉంది. వాళ్ళు ఎవరూ కూడా సినిమాను చూడలేదు. ఇప్పుడు కావాలి అనే వాళ్లను తన వైపుకు తిప్పుకోవడానికి కళ్యాణ్ బాబాయ్ అంటూ పవన్ కళ్యాణ్ ను సంబోధించడం చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. గోదావరి జిల్లాలలో అయితే ఒక థియేటర్లో అసలు నాలుగు టికెట్లు మాత్రమే బుక్ కావడంతో సినిమాను క్యాన్సిల్ చేశారు. ఇది చిన్న విషయమే అయినా అల్లు అర్జున్ మాత్రం జీర్ణించుకోలేకపోయినట్టు తెలుస్తోంది. చాలా ధియేటర్లు వీకెండ్ లో ఖాళీగా ఉండటం చూసి కాస్త షాక్ అయ్యాడు. అందుకే వీకెండ్ సమయంలో చూసుకుని ఆ ప్రకటన చేసినట్టు తెలుస్తోంది.