అల్లు అర్జున్ ట్రెండ్ సెట్ చేశారని ఆయన ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు. అయితే.. ఈ లుక్ కాంతారకి కాపీ అని.. ఆ సినిమా స్ఫూర్తితో ఈ లుక్ క్రియేట్ చేశారని కన్నడ ప్రేక్షకులు, మన దగ్గర కొందరు డిస్కషన్ స్టార్ట్ చేశారు. కాంతారాలో భూత కోల ఆచారాన్ని చూపించారు. రిషబ్ శెట్టి వేషధారణ అందరినీ ఆకట్టుకుంది. అల్లు అర్జున్ పుష్ప 2 లుక్ కూడా అలా ఉందనేది వారి వాదన! ఐతే వాళ్ల సంగతి ఎలా ఉన్నా.. అల్లు అర్జున్ లుక్ మాత్రం కేక పుట్టిస్తోంది. ఈ వేషం వెనక పెద్ద చరిత్రే ఉంది.
తిరుపతిలో గంగమ్మ జాతర జరుగుతుంది. ఆ జాతరలో పురుషులు.. మహిళల తరహాలో రెడీ అవుతారు. ఇప్పుడు అల్లు అర్జున్ లుక్ కూడా అదే ! చిత్తూరు, తిరుపతిలో ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో పుష్ప రూపొందుతోంది. దీంతో అక్కడ సంప్రదాయాన్ని సుకుమార్ చూపిస్తున్నారు. గంగమ్మ జాతర గురించి పుష్పలోని దాక్కో దాక్కో మేక… పాటలో కూడా చూపించారు. ఏమైనా లుక్ మాత్రం రచ్చ రేపుతోంది. అమ్మవారి వేషంలో చేతిలో గన్ పట్టుకొని కోపంగా అల్లు అర్జున్ నడుస్తున్న ఉన్న స్టిల్.. సినిమా మీద అంచనాలు పెంచేసింది. ఏదో జాతరలో ఎవరినో కాల్చేసే సీన్ అని క్లియర్‌గా అర్థం అవుతోంది. దీంతో ఆ సీన్ ఏంటి.. ఎలా ఉండబోతుందన్న ఆసక్తి మొదలైంది.