రీసెంట్‌గా ఓ సింగింగ్ కాంపిటీషన్‌కు చీఫ్ గెస్ట్‌గా వచ్చి అల్లు అర్జున్ తన భార్యను తాను ఎంత ప్రేమిస్తాడో చెప్పాడు. ప్రతీ భర్త భార్యకు స్వేచ్ఛ ఇవ్వాలని.. వాళ్ల ఫీలింగ్స్ కు విలువ ఇవ్వాలని అల్లు అర్జున్ చెప్పాడు. తాను కూడా తన భార్యను చాలా ప్రేమిస్తానని.. తను మనస్పూర్తిగా ఏదైనా చేయాలి అనుకుంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తానని చెప్పాడు. అల్లు అర్జున్ స్నేహ రెడ్డి గురించి చేసిన కామెంట్స్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.
మాటల్లోనే కాదు రియాలిటీలో కూడా అల్లు అర్జున్ తన భార్యను చాలా ప్రేమిస్తాడు. టైం దొరికిన ప్రతీసారి భార్యతో వెకేషన్స్‌కు వెళ్తుంటాడు. ఎంత బిజీగా ఉన్నా పిల్లలతో టైం స్పెండ్ చేస్తుంటాడు. ఇక అల్లు అర్జున్ తన కూతురు అర్హతో చేసే రీల్స్ ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతుంటాయి. అల్లు స్నేహ కూడా ప్రతీ విషయంలో భర్తకు అంతే సపోర్ట్‌గా ఉంటారు. అందుకే వీళ్లద్దరి మధ్య ఉంటే కెమిస్ట్రీ అంటే అల్లు ఫ్యాన్స్‌కు అంత ఇష్టం. చాలా కాలం నుంచి స్నేహరెడ్డితో అల్లు అర్జున్ ఓ సినిమా తీయాలని కూడా అభిమానులు కోరుతున్నారు. ఫ్యాన్స్ కోరుతున్న ఈ కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి మరి.