ALLU ARJUN: ఐకాన్ స్టార్ కోసం రంగంలోకి దిగుతున్న ప్రభాస్ హీరోయిన్

సాహోలో శ్రద్దా కపూర్, దేవరలో జాన్వీ కపూర్.. ఇలా టాలీవుడ్‌లో పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతోందంటే, సీన్‌లోకి బాలీవుడ్ హీరోయిన్ రావల్సిందే. నార్త్ మార్కెట్‌ని ఎట్రాక్ట్ చేయాలంటే అక్కడి హీరోయిన్‌ని రంగంలోకి దింపాల్సిందే.

  • Written By:
  • Publish Date - February 6, 2024 / 03:40 PM IST

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో రెబల్ స్టార్ హీరోయిన్ జోడీ కట్టబోతోంది. కల్కిలో ప్రభాస్ సరసన మెరవబోతున్న దీపికా పదుకొనే ఇప్పుడు బన్నీ సినిమా కోసం అడుగుముందుకేసింది. మరో తెలుగు సినిమా చేయబోతోంది. సాహోలో శ్రద్దా కపూర్, దేవరలో జాన్వీ కపూర్.. ఇలా టాలీవుడ్‌లో పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతోందంటే, సీన్‌లోకి బాలీవుడ్ హీరోయిన్ రావల్సిందే. నార్త్ మార్కెట్‌ని ఎట్రాక్ట్ చేయాలంటే అక్కడి హీరోయిన్‌ని రంగంలోకి దింపాల్సిందే.

SANDEEP REDDY VANGA: యానిమాల్ ఎటాక్.. బాలీవుడ్ మీద కామెంట్లతో సందీప్ రెడ్డి దాడి?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో బన్నీ సినిమా ఉండకపోవచ్చన్నారు. బోయపాటి లేదంటే ఆట్లీ మేకింగ్‌లో అల్లు అర్జున్ సినిమా అన్నారు. అవి ఉండే అవకాశం ఉన్నా, ముందుగా ఎనౌన్స్ చేసినట్టు త్రివిక్రమ్‌తో బన్నీ సినిమా సెట్స్ పైకెళుతోంది. సెప్టెంబర్‌లో సెట్స్ పైకెళ్లే ఈ ప్రాజెక్ట్‌లో దీపికా పదుకొనే హీరోయిన్ అని తెలుస్తోంది. నిజానికి కల్కిలో హీరోయిన్‌గా నటిస్తున్న దీపికాని దేవర మూవీకోసం ట్రై చేసింది ఎన్టీఆర్ టీం. కాని తను అప్పుడు కల్కితో బిజీ అవటంతో కుదర్లేదు. ఐతే ప్రశాంత్ నీల్ మేకింగ్‌లో చేసే మూవీలో మాత్రం తారక్‌కి జోడీ దీపికానే అంటున్నారు.

అదే జరిగితే తారక్, బన్నీ, ప్రభాస్ ముగ్గురు ఒకే హిందీ హీరోయిన్‌‌ తో జోడీ కట్టినట్టవుతుంది. దీపికకు కూడా కల్కి తర్వాత బన్నీ మూవీ, ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమా అంటూ వరుసగా మూడు పాన్ ఇండియా మూవీలు చేసినట్టౌతుంది. తనకి కూడా బానే వర్కవుట్ అవుతోంది.