ఒకప్పుడు పూరి జగన్నాథ్ సినిమాలు అంటే జనాలకు ఓ రేంజ్ లో పిచ్చి ఉండేది. అసలు సినిమాలో డైలాగ్ లు గాని ఆ కథల ఎంపిక గాని అన్నీ భిన్నంగా ప్లాన్ చేసుకునే వాడు పూరి జగన్నాథ్. అలాంటి పూరి ఇప్పుడు నానా కష్టాలు పడుతున్నాడు అనే విషయం క్లియర్ గా అర్ధమవుతోంది. సినిమాలు ఒక్కటంటే ఒక్కటి కూడా అంచనాలను అందుకోవడం లేదు. కొడుకుని హీరో చేయాలని చూసినా అది కూడా వర్కౌట్ కావడం లేదు. ఆకాష్ కూడా వేరే వాళ్ళతో సినిమాలు చేయలేకపోతున్నాడు. ఇక పూరి కెరీర్ ముగిసింది అనే టాక్ కూడా వస్తోంది.
ఇటీవల వచ్చిన డబుల్ ఇస్మార్ట్ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు అనే చెప్పాలి. ఈ సినిమా కోసం పూరి రెండేళ్ళు కష్టపడినా సినిమా మాత్రం ఆడలేదు. ఇప్పుడు మరి పూరి ప్లాన్ ఏంటీ అంటే… అల్లు అర్జున్ కోసం ఓ మాస్ కథను రెడీ చేసి పెట్టాడట. 2020లో కరోనా సమయంలో ఈ కథ రెడీ చేసుకున్నాడట పూరి. ఆ కథను బన్నీకి వినిపించడానికి అవకాశం లేక ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్ చేసే సినిమాలపై క్లారిటీ రాలేదు. కొరటాల శివ, త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగా ఇలా చాలా పేర్లు ఉన్నాయి.
కొరటాల దేవర 2 మీదనే వర్క్ చేయాలని డిసైడ్ అయ్యాడట. ఎన్టీఆర్ లేని సీన్స్ ని డిసెంబర్ లో మొదలుపెట్టి షూట్ చేయాలని రెడీ అయ్యాడట. అందుకే ఇప్పుడు వేరే సినిమాల మీద ఫోకస్ పెట్టలేకపోతున్నాడు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ పై నమ్మకం లేదు. అందుకే ఇప్పుడు పూరితో ముందుకు వెళ్ళడానికి బన్నీ సిద్దంగా ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే పూరి వినిపించిన కథ కంటే… వక్కంతం వంశీ వద్ద పూరి ఒక కథ తీసుకున్నాడట. ఆ కథ కూడా బన్నీ విన్నట్టుగా సమాచారం. ఓ సెంట్రల్ గవర్నమెంట్ లో పని చేసే సెక్యూరిటీ ఆఫీసర్ కథ అది.
అది బన్నీకి బాగా నచ్చిందట. వంశీ కథతో అయితే తాను సినిమా చేస్తాను అని ఆలోచించి చెప్పాలని బన్నీ కండీషన్ పెట్టాడట. గతంలో పూరి… టెంపర్ కథను వంశీ దగ్గరే తీసుకున్నాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఏదొకటి అనుకున్న పూరి బన్నీకి ఓకే చెప్పడానికి సిద్దమయ్యాడని టాక్. ఇప్పటికే పుష్ప 2 లేట్ తో చికాకులో ఉన్న ఫ్యాన్స్ కి పూరి సినిమా అయితే ఆరు నెలల్లో విడుదల చేయవచ్చు. వచ్చే ఏడాది ఆగస్ట్ 15కి సినిమా రెడీ అయిపోయినా ఆశ్చర్యం లేదు. అందుకే బన్నీ పూరిని ఓకే చేసినట్టుగా సినీ వర్గాలు అంటున్నాయి. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సిద్దమవుతుందో చూడాలి.