Allu Arjun: అల్లు అర్జున్‌ బాప్‌ ఆఫ్‌ స్టైల్‌..

టాలీవుడ్‌లో స్టైలిష్‌ హీరో ఎవరు అంటే హీరోలు కూడా చెప్పే పేరు ఒకటే. అతనే అల్లు అర్జున్‌. స్క్రీన్‌ మీదే కాదు.. ఆఫ్‌ స్క్రీన్‌లో కూడా అల్లు అర్జున్‌ మెయిన్‌టేన్‌ చేసే స్టైల్‌ వేరే లెవెల్‌.

  • Written By:
  • Publish Date - June 8, 2023 / 12:23 PM IST

అకేషన్‌కు తగ్గట్టుగా.. సిచ్యువేషన్‌కు సెట్‌ అయ్యేలా పర్ఫెక్ట్‌ అవుట్‌ఫిట్‌ మెయిన్‌నేట్‌ చేస్తాడు బన్నీ. అవుట్‌ఫిట్‌ మాత్రమే కాదు. హెయిర్‌స్టైల్‌ కూడా. ప్రతీ సినిమాకు కొత్త హెయిర్‌ స్టైల్‌తో వచ్చి ఫ్యాన్స్‌ను పిచ్చెక్కిస్తాడు. ఇప్పటి వరకూ టాలీవుడ్‌లో ఎక్కువ హెయిర్‌ స్టైల్స్‌ మార్చి సినిమాలు చేసిన ఏకైక హీరో బన్నీ మాత్రమే. అందుకే అతని ఫ్యాన్స్‌ అంతా బన్నీని స్టైలిష్‌ స్టార్‌ అని పిలుస్తారు.

ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్‌లో ఉన్న అల్లు అర్జున్‌ ఆ సినిమా కోసం కొత్త హెయిర్‌ స్టైల్ మెయిన్‌టేన్‌ చేస్తున్నాడు. రీసెంట్‌గా షూటింగ్‌ షెడ్యూల్‌కు బ్రేక్‌ రావడంతో ఫ్యామిలీతో కలిసి యూరప్‌ ట్రిప్‌కు వెళ్లాడు అల్లు అర్జున్‌. తన భార్య స్నేహ రెడ్డితో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో ఫొటోలకు ఫోజిచ్చాడు. ఈ ఫొటోలో బన్నీ లుక్‌ చాలా స్టైలిష్‌గా ఉంది. అటు స్నేహ రెడ్డి కూడా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు. పేరుకు సినిమాలు చేయదు కావొచ్చు కానీ.. స్నేహరెడ్డి మాత్రం హీరోయిన్‌ మెటీరియల్‌. ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఇద్దరి పెయిర్‌ భార్యాభర్తల్లా లేదు.. సినిమాలో హీరోహీరోయిన్‌ లాగానే ఉందంటున్నారు ఫ్యాన్స్‌. బన్నీకొత్త లుక్‌కు ఫిదా అయిపోయారు. పుష్ప-2లో స్టైలిష్‌ లుక్‌ లోడింగ్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు.