ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అస్సలు తగ్గడం లేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప ది రూల్’ మూవీ చేస్తున్న బన్నీ.. ఆ తర్వాత డైరెక్టర్స్ త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగాతో సినిమాలు కమిటై ఉన్నాడు. ‘పుష్ప-2’ వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల కానుండగా, ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. సందీప్ రెడ్డి సినిమా మాత్రం కాస్త ఆలస్యమయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఆ గ్యాప్‌లో మరో సినిమా పూర్తి చేయాలని చూస్తున్నాడు బన్నీ.
రీసెంట్గా ‘జవాన్’తో బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ అట్లీతో బన్నీ సినిమా దాదాపు ఖరారైందని ఇటీవల వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు సడెన్‌గా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ పేరు తెరపైకి వచ్చింది. తక్కువ సినిమాలతోనే తమిళ్లో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నెల్సన్. ముఖ్యంగా ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్‌తో చేసిన ‘జైలర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు నెల్సన్. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతేకాదు ఇప్పుడు అల్లు అర్జున్‌తో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడని తెలుస్తోంది. నెల్సన్ తన తరువాతి సినిమాను అల్లు అర్జున్‌తో చేయాలని ఫిక్స్ అయ్యారట. ఈ కాంబోని రేసుగుర్రం నిర్మాత నల్లమలుపు బుజ్జి సెట్ చేస్తున్నారట. ఇప్పటికే బన్నీతో కథా చర్చలు జరిగాయని ఫిల్మ్ నగర్ సర్కిల్లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
నెల్సన్ చెప్పిన కథ బన్నీకి నచ్చిందని.. దీంతో దర్శకుడు కథకు తుదిమెరుగులు దిద్దే పనిలో పడ్డారని తెలుస్తోంది. అన్నీ కుదిరితే త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌తో పాటు నెల్సన్ ప్రాజెక్ట్ కూడా వచ్చే ఏడాది పట్టాలెక్కనుందని సమాచారం. మొత్తానికి నెల్సన్ ఎంట్రీతో ప్రస్తుతానికి బన్నీ-అట్లీ కాంబినేషన్లో సినిమా లేనట్టేనని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.