దేవర దెబ్బ” పుష్ప వణుకుతున్నాడా…? ప్లాన్ ఏంటీ…?

స్టార్ హీరోలతో కేలుక్కుంటే ఏం చేయగలమో ఫ్యాన్స్ దేవర సినిమాకు కచ్చితంగా చూపించారు. సినిమా బాగున్నా కూడా బాగాలేదని ఓ రేంజ్ లో మెగా ఫ్యాన్స్ టార్గెట్ చేసి ప్రచారం చేసారు. ఈ ప్రచారం దెబ్బకు ఎన్టీఆర్ కూడా బాగా ఇబ్బంది పడ్డాడు అనే మాట వాస్తవం.

  • Written By:
  • Publish Date - October 2, 2024 / 06:28 PM IST

స్టార్ హీరోలతో కేలుక్కుంటే ఏం చేయగలమో ఫ్యాన్స్ దేవర సినిమాకు కచ్చితంగా చూపించారు. సినిమా బాగున్నా కూడా బాగాలేదని ఓ రేంజ్ లో మెగా ఫ్యాన్స్ టార్గెట్ చేసి ప్రచారం చేసారు. ఈ ప్రచారం దెబ్బకు ఎన్టీఆర్ కూడా బాగా ఇబ్బంది పడ్డాడు అనే మాట వాస్తవం. కొరటాల శివ మీద ఉన్న కోపాన్ని ఈ రేంజ్ లో చూపించారు మెగా ఫ్యాన్స్. దానికి తోడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ కూడా టార్గెట్ చేయడం దేవరకు పెద్ద తలనొప్పి అయింది. అందుకే ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోలు భయపడుతున్నారు.

కొరటాల శివ చేసిన కామెంట్స్ కే దేవరను అలా టార్గెట్ చేస్తే డిసెంబర్ లో విడుదల కాబోయే పుష్ప 2 పరిస్థితి ఏంటో ఊహించుకుంటేనే భయంగా ఉంది కదా…? ఇప్పుడు ఈ భయం అల్లు అర్జున్ ని వెంటాడుతుంది. అసలు అల్లు అర్జున్ కి మెగా ఫ్యాన్స్ కి మధ్య పచ్చ గడ్డి వేస్తేనే భగ్గుమనే వాతావరణం ఉంది. కచ్చితంగా సినిమాను టార్గెట్ చేస్తారు. దేవర సినిమా అయితే పాటలు, లుక్స్, మ్యూజిక్ ఇలా ప్రతీ ఒక్కటి టార్గెట్ చేసారు. సినిమా విడుదల తర్వాత అది మరీ దారుణంగా ఉందనే మాట వాస్తవం. ఇక పుష్ప 2 కోసం మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

అల్లు అర్జున్ ఇప్పుడు మెగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను యుద్ధం చూడాలి. అందుకే అల్లు అర్జున్ భయంతో జాగ్రత్త పడుతున్నట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా విషయంలో ఒక టీంని ఇప్పటికే ఏర్పాటు చేసాడని, దాదాపు 30 మీం పేజెస్ తో ఇప్పటికే ఒప్పందం కూడా చేసుకున్నారని, ముఖ్యంగా ఎక్స్ లో భారీగా సినిమాపై హైప్ క్రియేట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారని టాక్. మెగా ఫ్యాన్స్ నెగటివ్ ప్రచారం దేవర వసూళ్ళపై కచ్చితంగా పడిన మాట వాస్తవం. అందుకనే ఇప్పుడు అల్లు అర్జున్ జాగ్రత్తగా తన టీంని ఏర్పాటు చేసుకుంటున్నాడు అని టాక్. మరి ఈ ప్రయత్నం ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి.