Charan – Banny: చరణ్‌పై బన్నీ కడుపు మంట.. పుష్ప2 ని ఆస్కార్‌కి పంపాలని నిర్ణయం?

పుష్పతో పాన్‌ ఇండియా సంపాదించుకున్న అల్లు అర్జున్‌.. పుష్ప2తో ఆస్కార్‌కు వెళ్లాలని ఇప్పటి నుంచే ప్లాన్‌ చేస్తున్నారట. పుష్పతో ఆస్కార్ కి వెళ్లకుండా తప్పుచేశామని.. పుష్ప2తో ట్రై చేసి.. ఏదో ఒక విభాగంలో ఆస్కార్‌కు నామినేట్‌ కావాల్సిందేనన్న ఆలోచనలో వున్నారని తెలిసింది.

  • Written By:
  • Publish Date - March 16, 2023 / 12:49 PM IST

ఆస్కార్‌ అందుకున్న ఆర్‌ఆర్ఆర్‌ టీంను అభినందిస్తూ.. అల్లు అర్జున్‌ ట్వీట్‌ చేశాడు. అయితే.. స్టైలిష్‌ స్టార్‌ పోస్ట్‌ ట్రోలింగ్‌ అవుతోంది. బన్నీని తప్పుపడుతూ.. కామెంట్స్‌ చేస్తున్నారు. పోస్ట్‌లో ఎవరినీ మర్చిపోకుండా.. అందరినీ అభినందించాడు. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్‌ ఎనౌన్స్‌ చేయడం ఆలస్యం… ఇండియా గర్వంతో ఉప్పొంగిపోయింది. ప్రధానమంత్రి నుంచి సినీ రాజకీయ ప్రముఖులు ఒకరేంటి చాలామంది తన ఆనందాన్ని షేర్‌ చేసుకున్నారు. అయితే… బన్నీ ఒక రోజు ఆలస్యంగా ఆర్‌ఆర్ఆర్‌ టీంకు విషెష్‌ తెలిపాడు. ఆస్కార్‌ అందుకున్న రోజు రెస్పాండ్‌ కాకపోయినా.. బన్నీని ఎవరూ తప్పు పట్టలేదు. ఒకరోజు లేటుగా స్పందించి విమర్శలు ఎదుర్కొంటున్నాడు .
ఆస్కార్‌ వేదికపై తెలుగు పాట ప్రపంచాన్ని షేక్‌ చేయడం సంతోషంగా వుందని… ఇండియన్‌ సినిమాకు ఇది హార్ట్‌ టచింగ్‌ మూమెంట్ అని ట్వీట్‌ చేశాడు బన్నీ. నెటిజన్లు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా… ఎందుకు ఆలస్యంగా రియాక్ట్‌ అయ్యావని మండిపడుతున్నారు. తెలుగు సినిమాకు ఆస్కార్‌ రావడం చిన్న విషయమే కాదు. అదొక అద్భుతం. 26 గంటల తర్వాత స్పందిస్తావా? అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. అసలు రెస్పాన్డ్ అవ్వకుంటానే బాగుండేదన్నారు. చాలాకాలంగా రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ అభిమానుల మధ్య ట్రోలింగ్‌ నడుస్తోంది. ఆమధ్య ఓసారి హద్దులు దాటి… వినకూడని మాటలతో విమర్శించుకున్నారు.
బన్నీ లేటుగా స్పందించడంతో… రామ్‌చరణ్‌ అభిమానులే కాదు.. చాలామంది ట్రోల్‌ చేశారు. రామ్‌చరణ్‌ సినిమాకు ఆస్కార్‌రావడం ఇష్టం లేకనే ఇలా చేశావా? అంటూ కడిగేస్తున్నారు. ఈమధ్యకాలంలో బన్నీ, రామ్‌చరణ్‌ సోషల్‌ మీడియా పోస్టులు చూస్తుంటే.. ఈ ఇద్దరి మధ్యా పోటీ గట్టిగా నడుస్తోందనిపిస్తోంది. బన్నీ తన ఫ్యామిలీ ఫొటోలు.. వీడియోలు షేర్‌ చేస్తే.. ఆతర్వాత రామ్‌చరణ్‌ నుంచి ఏదో ఒక అప్డేడ్‌ వస్తుంది. రామ్‌చరణ్‌ గురించి ఏదైనా న్యూస్‌ వస్తే… బన్నీ నుంచి మరో వార్త రావాల్సిందే. ఇలా.. సోషల్‌ మీడియాలో నువ్వా నేనా అన్నట్టు పోస్టులు పెడుతున్నారు ఈ బావాబామర్దులు.
తెలుగులో చాలామంది స్టార్స్‌ వున్నా… సోషల్‌ మీడియాలో రామ్‌చరణ్‌, బన్నీ పిఆర్‌ టీం అందరికంటే ఎక్కువ యాక్టీవ్‌. ఎప్పడికప్పడు ఏదో ఒక అప్‌డేట్‌ ఇవ్వడంతో… పోటీ వున్నట్టు కనిపిస్తుందో.. లేదంటే చెర్రీ, బన్నీ మధ్య నిజంగానే కాంపిటీషన్‌ నడుస్తుందోగానీ… ఒకరోజు ఆలస్యంగా ఆస్కార్‌ పై రెస్పాన్స్ అయి విమర్శలు కొని తెచ్చుకున్నాడు బన్నీ. పుష్పతో పాన్‌ ఇండియా సంపాదించుకున్న అల్లు అర్జున్‌.. పుష్ప2తో ఆస్కార్‌కు వెళ్లాలని ఇప్పటి నుంచే ప్లాన్‌ చేస్తున్నారట. పుష్పతో ఆస్కార్ కి వెళ్లకుండా తప్పుచేశామని.. పుష్ప2తో ట్రై చేసి.. ఏదో ఒక విభాగంలో ఆస్కార్‌కు నామినేట్‌ కావాల్సిందేనన్న ఆలోచనలో వున్నారని తెలిసింది. రాజమౌళీ ఆశీస్సులతో రామ్‌చరణ్‌ మూవీ ఆస్కార్‌కు వెళ్తే… బన్నీ పుష్ప2తో వెళ్తాడేమో చూడాలి మరి. .