ఏకంగా 65 శాతం షూటింగ్ ని పూర్తి చేసింది ఫిల్మ్ టీం. 8 ఫైట్ సీన్లు, ప్రీ క్లైమాక్స్ తోపాటు టాకీ పార్ట్ లో 70 శాతం పూర్తైంది. ఇక పాటలు, క్లైమాక్స్ తోపాటు 25 సీన్లు తెరకెక్కించాల్సి ఉందట. సెప్టెంబర్ కల్లా షూటింగ్ పూర్తి చేసి, అప్పటి నుంచే ప్రమోషన్ షురూ చేయబోతోంది ఫిల్మ్ టీం.
అంతేకాదు డిసెంబర్ 22 కి పుష్ప 2 రిలీజ్ అనుకున్నారు కాని, పుష్ప 1 విడుదలైన డిసెంబర్ 17 కి ఒక రోజు ముందు అంటే డిసెంబర్ 16న రిలీజ్ చేయబోతున్నారట. క్రిస్ మస్ కి 9 రోజుల ముందే పుష్ప 2 ని రిలీజ్ చేయాలని ఫిల్మ్ టీం ప్లాన్ చేసింది. విజువల్ ఎఫెక్ట్స్ పనులు కూడా 60 శాతం పూర్తయ్యాయట.