సినిమా ఇండస్ట్రీలో హీరోలైనా, హీరోయిన్లయినా వచ్చిన అవకాశాన్ని, తమకు నచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ కోట్లు సంపాదిలచాలని చూస్తుంటారు. సినిమాల్లో నటించడమే కాకుండా వ్యాపార ప్రకటనలతో కూడా డబ్బు సంపాదిస్తుంటారు. కొందరు స్టార్ హీరోలు కొన్ని బ్రాండ్లకు అంబాసిడర్స్‌గా ఉంటూ ఆ కంపెనీలను ప్రమోట్ చేస్తుంటారు. దానికి తగిన పారితోషికం అందుకుంటారు. వారిలో అల్లు అర్జున్ ఒకరు. సినిమాలతోపాటు కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. అయితే కొన్ని రకాల వస్తువులను ప్రమోట్ చెయ్యకూడదనే రూల్ పెట్టుకున్నాడు బన్ని. అందుకే యాడ్స్‌ను సెలెక్టివ్‌గా చేస్తుంటాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పుష్ప 2 మూవీతో బిజీగా ఉన్నాడు. ఇక ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న కేశవ అలియాస్ జగదీష్ అరెస్ట్ కావడంతో.. సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం కానుంది. కాగా.. ఈ చిత్రం తర్వాత బన్నీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే తాజాగా బన్నీకి సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే ఓ చిన్న యాడ్ చేస్తే 10 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తామని ప్రముఖ కంపెనీ ఆఫర్ చేసిందట. కానీ ఆ ఆఫర్ కు నో చెప్పాడట ఐకాన్ స్టార్.
వివరాల్లోకి వెళితే.. పుష్ప చిత్రంలో అ అర్జున్ క్యారెక్టర్‌కి సంబంధించి మందు తాగే సన్నివేశాలు, గుట్కాలు తినే సన్నివేశాల్లో తమ బ్రాండ్ లోగోలను వినియోగించాలని, అలా చేస్తే 10 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తామని ఆఫర్ ఇచ్చారట. ప్రజలకు హాని చేసే వస్తువులను తాను ప్రమోట్ చేయనని ఆ కంపెనీకి చెప్పేశాడట బన్నీ. ఇప్పుడు బన్ని చేసిన పనిని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. తమ హీరో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల అభిమానులు ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నారు.