300 ల కోట్లా…? దీనెమ్మ పుష్ప గాడి రేంజ్ ఇది

ఇండియన్ సినిమాలో పుష్ప 2 ఇప్పుడు సెన్సేషన్ అవుతోంది. ఇండియన్ మీడియా ఫోకస్ మొత్తం పుష్పపైనే ఉంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్స్ ను పీక్స్ లో చేస్తున్నారు పుష్ప మేకర్స్.

  • Written By:
  • Publish Date - November 16, 2024 / 01:48 PM IST

ఇండియన్ సినిమాలో పుష్ప 2 ఇప్పుడు సెన్సేషన్ అవుతోంది. ఇండియన్ మీడియా ఫోకస్ మొత్తం పుష్పపైనే ఉంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్స్ ను పీక్స్ లో చేస్తున్నారు పుష్ప మేకర్స్. బాహుబలి 2 కోసం రెండేళ్ళు పడితే పుష్ప 2 కోసం మూడేళ్ళకు పైగా పట్టడంపై సినిమాపై హైప్ పెంచుతోంది. రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టి సినిమా రిలీజ్ విషయంలో ముందు నుంచి ఉన్న డౌట్స్ పై క్లారిటీ ఇచ్చేసారు మేకర్స్. చెప్పిన డేట్ కంటే ఒక రోజు ముందుగానే అంటే డిసెంబర్ 5 నే సినిమా రిలీజ్ అవుతోంది.

ఓవర్సీస్ లో సినిమా ఒక రోజు ముందుగానే విడుదల కానుంది. విడుదల కావడానికి ఇంకా 20 రోజులు ఉంది. ఈ 20 రోజులు ప్రమోషన్స్ పీక్స్ లో చేస్తున్నారు. ఇక ఓవర్సీస్ లో ఇప్పటికే ప్రీ బుకింగ్ మార్కెట్ స్టార్ట్ అయి దుమ్ము రేపుతోంది. అక్కడ ఇప్పటికే 45 వేలకు పైగా టికెట్ లు బుక్ చేసారు. ఇప్పుడు ప్రమోషన్స్ విషయంలో నార్త్ ఇండియాను పుష్ప టీం టార్గెట్ చేసింది. అన్ని నార్త్ రాష్ట్రాల్లో ఈవెంట్స్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసి రంగంలోకి దిగారు. బీహార్ లోని పాట్నా, మధ్యప్రదేశ్ ఇండోర్, గుజరాత్… గాంధీ నగర్, పంజాబ్ లో మొహాలి లేదంటే అమృత్ సర్… అంటూ ఇండియా మొత్తం పుష్ప మేనియా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

అమెరికా, ఆస్ట్రేలియాలో కూడా ఈవెంట్స్ ప్లాన్ చేస్తుంది పుష్ప టీం. త్వరలోనే ట్రైలర్ కూడా రిలీజ్ అవుతోంది. 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా విషయంలో బన్నీ ఎంత కష్టపడ్డాడు అనేది ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్స్ క్లియర్ గా చెప్తున్నాయి. ఈ నేపధ్యంలో అసలు బన్నీ రెమ్యునరేషన్ ఎంత అనేది ఇప్పుడు హాట్ టాపిక్. అయిదేళ్ళ నుంచి పుష్ప కోసమే బన్నీ కష్టపడుతున్నాడు. కాబట్టి మైత్రీ మూవీ మేకర్స్ భారీగానే పే చేయడానికి రెడీ అయ్యారు. నిజానికి అల్లు అర్జున్ ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోల్లో ఒకడు.

పుష్ప కోసం ఇప్పుడు ఇండియాలో ఏ హీరో ఊహకు కూడా అందని రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు బన్నీ. నిజానికి భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోల్లో తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ముందు వరుసలో ఉంటే విజయ్ ను బీట్ చేస్తున్నాడు బన్నీ. విజయ్ తన చివరి చిత్రానికి 275 కోట్ల రూపాయల పారితోషికం తీసుకోగా పుష్ప కోసం బన్నీ అంతకు మించి తీసుకోవడం హాట్ టాపిక్. పుష్ప సినిమాకుగాను బన్నీ రూ . 325 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు టాక్. హీరోయిన్ గా చేస్తున్న రష్మిక మందన్న సినిమా కోసం 10 కోట్లు, విలన్ గా సినిమా కోసం ప్రాణం పెట్టిన మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ కేవలం 8 కోట్లు మాత్రమే తీసుకున్నాడట. సుకుమార్ కు దాదాపు 80 కోట్లు ఇచ్చారని టాక్.