సుకుమార్ పై బన్నీ సీరియస్… నువ్విలా చేయడం బాలేదు

ఏదేమైనా పుష్ప సినిమా మాత్రం ఎన్నో సెన్సేషన్స్ క్రియేట్ చేసింది. పార్ట్ వన్ కంటే పార్ట్2 సినిమా పరంగా కంటే కాంట్రవర్సీలు పరంగా బాగా ఫేమస్ అయింది. ఇండియా వైడ్ గా ఈ సినిమా గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకునే పరిస్థితి క్రియేట్ అయింది.

  • Written By:
  • Publish Date - December 28, 2024 / 07:21 PM IST

ఏదేమైనా పుష్ప సినిమా మాత్రం ఎన్నో సెన్సేషన్స్ క్రియేట్ చేసింది. పార్ట్ వన్ కంటే పార్ట్2 సినిమా పరంగా కంటే కాంట్రవర్సీలు పరంగా బాగా ఫేమస్ అయింది. ఇండియా వైడ్ గా ఈ సినిమా గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకునే పరిస్థితి క్రియేట్ అయింది. అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం ఒక సెన్సేషన్ అయితే ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు కూడా మరో సెన్సేషన్. ఒక స్టార్ హీరో గురించి ఒక ముఖ్యమంత్రి శాసనసభ సాక్షిగా మాట్లాడటం ఒక సంచలనం అనే చెప్పాలి. ఇక ఈ సినిమా గురించి అల్లు అర్జున్ కు అలాగే సుకుమార్ కు మధ్య రీసెంట్ గా గొడవైంది అనే ఒక న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన తర్వాత సుకుమార్ పెద్దగా రియాక్ట్ కాలేదు. అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి వచ్చాడు. ఆ తర్వాత రామ్ చరణ్ సినిమా కోసం ప్రమోషన్స్ చేసే పనిలోపడ్డాడు సుకుమార్. అయితే ఇది అల్లు అర్జున్ కు నచ్చలేదని సుకుమార్ తో గొడవ అయిందని… నాలుగేళ్లపాటు కలిసి పనిచేశామని నేను కష్టాల్లో ఉన్న టైంలో నువ్వు ఇలా బిహేవ్ చేయడం ఏమాత్రం బాగా లేదంటూ సుకుమార్ అల్లు అర్జున్ సీరియస్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్స్ కోసం అమెరికా వెళ్ళిన సుకుమార్ అక్కడ కొన్ని కామెంట్స్ చేశాడు.

తనకు ఏ హీరోతో ఎక్కువ బాండింగ్ లేదని కానీ రంగస్థలం సినిమా తర్వాత రామ్ చరణ్తో ఎక్కువ బాండింగ్ క్రియేట్ అయిందని ఇప్పుడు మళ్లీ రామ్ చరణ్ తో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నానంటూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి కూడా నచ్చలేదు. అల్లు అర్జున్ తో నాలుగు సినిమాలు చేసిన సుకుమార్ ఇలా మాట్లాడతాడని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకున్న సుకుమార్ భవిష్యత్తులో ఏ ఇబ్బందులు రాకుండా ఉండేందుకు కాస్త జాగ్రత్తలు పడుతున్నట్లుగానే కనబడుతోంది.

మెగా ఫ్యామిలీని దూరం చేసుకుని అల్లు అర్జున్ ఇబ్బందులు పడటంతో అనవసరంగా అల్లు అర్జున్ వెంట వెళ్లి తాను కూడా ఇబ్బందులు పడటం ఎందుకు అనే ఒపీనియన్ లో కూడా సుకుమార్ ఉన్నట్లు అర్థమవుతుంది. అందుకే పెద్దగా రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయలేదు. సోషల్ మీడియాలో కూడా అల్లు అర్జున్ కు మద్దతుగా పోస్టులు కూడా పెట్టలేదు సుకుమార్. ఇక గేమ్ చేంజర్ సినిమా ఈవెంట్ లో కూడా దీనికి సంబంధించి ఎటువంటి కామెంట్స్ సుకుమార్ నుంచి రాలేదు. ప్రస్తుతం రామ్ చరణ్ సినిమా కోసం కథ రెడీ చేసే పనిలో ఉన్నాడు సుక్కు. ఈ సినిమాను వచ్చేయడాది ఆగస్టు నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం బుచ్చిబాబుతో రామ్ చరణ్ సినిమా కంప్లీట్ చేస్తున్నాడు.