Ram Charan: మెగా రివేంజ్ వల్లే పుష్ప 2 రిలీజ్ డేట్ మారిందా..?

బన్నీకి పవన్‌తో గ్యాప్ ఉంది. మెగా అభిమాని అని చెప్పుకునే బన్నీ, సొంతంగా ఫ్యాన్స్‌ని, ఫ్యాన్ బేస్‌ని, ఆర్మీని మేయింటేన్ చేయటం వెనక తన కసి ఉంది. మెగాస్టార్ అభిమానే అయినా, మెగా వారసులకున్నంత గుర్తింపు తనకి లేకపోవటం, దక్కకపోవటం వల్లే ఆ గ్యాప్ క్రియేట్ అయ్యిందనే వాళ్లున్నారు.

  • Written By:
  • Publish Date - September 12, 2023 / 06:15 PM IST

Ram Charan: రామ్ చరణ్, బన్నీ మధ్య ఈక్వేషన్స్ మరింత దిగజారిపోయాయా..? సడన్‌గా పుష్ప 2 రిలీజ్ డేట్‌ని ఇప్పుడే ఎనౌన్స్ చేయటం వెనక మెగా రివేంజ్ ఉందంటున్నారు. బన్నీకి పవన్‌తో గ్యాప్ ఉంది. మెగా అభిమాని అని చెప్పుకునే బన్నీ, సొంతంగా ఫ్యాన్స్‌ని, ఫ్యాన్ బేస్‌ని, ఆర్మీని మేయింటేన్ చేయటం వెనక తన కసి ఉంది. మెగాస్టార్ అభిమానే అయినా, మెగా వారసులకున్నంత గుర్తింపు తనకి లేకపోవటం, దక్కకపోవటం వల్లే ఆ గ్యాప్ క్రియేట్ అయ్యిందనే వాళ్లున్నారు.

ఆ కసే తనని పుష్పరాజ్‌గా మార్చి, అలా వచ్చిన నేమ్‌తో, నేషనల్ అవార్డ్‌తో వచ్చిన ఫేమ్‌తో ఇప్పుడు బన్నీ మెగా వారసుడికే ఝలక్ ఇచ్చే రేంజ్‌కి ఎదిగిపోయాడనే అభిప్రాయం పెరిగింది. ఐతే పుష్ప 2ని ఆగస్ట్ 15కి రిలీజ్ చేయటం ఒక ఎత్తైతే, ఆ డేట్‌ని ఇప్పుడే.. అంటే 10 నెలల ముందే తేల్చేయటం చూస్తుంటే ఇది కావాలని చేసిన పనిలా ఉందంటున్నారు. మార్చ్ 22న రావాల్సిన పుష్ప ఆగస్ట్ 15కి మార్చటం వెనక, ఆ డేట్ ముందే ఎనౌన్స్ చేయటం వెనక గేమ్ ఛేంజింగ్ ప్లాన్ ఉందట. ఒకటి భారతీయుడు 2 ఆగస్ట్ 15కి అన్నారు. అది మిస్ అయ్యి దసరాకు వాయిదా పడితే గేమ్ ఛేంజర్‌ని అప్పుడు విడుదల చేయాలనేది శంకర్ ప్లాన్ అంటున్నారు. అందుకే వాళ్ళు ఎనౌన్స్ చేయటానికి ముందే ఆ డేట్‌ని పుష్ప 2 టీం కబ్జా చేసిందట.

మార్చ్ 22 కల్లా పుష్ప 2 తెరకెక్కుతుందేమోకాని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ ఉండొచ్చు. ప్రమోషన్‌కి టైం సరిపోకపోవచ్చు. అలాగని తర్వాత చూద్దామంటే.. సీన్లో తారక్ దేవర, ప్రభాస్ కల్కి రిలీజ్‌లు ఉన్నాయి. కాబట్టే ఆగస్ట్ 15కి చరణ్ మూవీ రాబోతోందని తెలిసి, వాళ్లకంటే ముందే ఆ డేట్‌ని బుక్ చేసుకోవాలని, ఇంకా 10 నెలల టైం ఉన్నా.. పనికట్టుకుని అర్జెంట్‌గా పుష్ప 2 టీం ఇలా డేట్ ఎనౌన్స్ చేసిందట.