Allu Arjun: అరుదైన గౌరవం.. బెర్లిన్‌కు అల్లు అర్జున్.. ఎందుకో తెలుసా..?

ఈ చిత్రంలో బన్నీ.. తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ సంతోషంలో ఉన్న అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం దక్కినట్లు తెలుస్తోంది. పుష్పతో గ్లోబల్ రేంజ్‌లో పాపులారిటిని సంపాదించుకున్న అల్లు అర్జున్.. మరో అరుదైన ఛాన్స్ అందుకున్నాడు.

  • Written By:
  • Publish Date - February 15, 2024 / 02:25 PM IST

Allu Arjun: టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పేరు పాన్ ఇండియా రేంజ్‌లో మార్మోగిపోతోంది. ఇటీవలే జాతీయ ఉత్తమ నటుడి పురస్కారానికి దక్కించుకున్నాడు. పుష్ప సినిమాలో స్టైలిష్ స్టార్‌ అద్భుత నటనకుగానూ ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం వరించింది. ఈ చిత్రంలో బన్నీ.. తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ సంతోషంలో ఉన్న అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం దక్కినట్లు తెలుస్తోంది.

Sai pallavi: ల‌వ్ స్టోరీ.. సాయి ప‌ల్ల‌వి-చై వాలంటైన్స్‌డే సెల‌బ్రేష‌న్స్

పుష్పతో గ్లోబల్ రేంజ్‌లో పాపులారిటిని సంపాదించుకున్న అల్లు అర్జున్.. మరో అరుదైన ఛాన్స్ అందుకున్నాడు. ఎంతో ప్రతిష్మాతంగా జరిగిన బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌‌లో సందడి చేయనున్నాడు. సౌత్ ఇండస్ట్రీని ప్రమోట్ చేయడానికి బన్నీ బయలుదేరడంతో అల్లు అభిమానులు ఖుషి అవుతున్నారు. అలాగే పుష్ప చిత్రాన్ని అక్కడ ప్రత్యేకంగా ప్రదర్శించబోతున్నారు. ప్రజెంట్ బన్నీ పుష్ప 2 తో బిజీగా ఉన్నాడు. యాక్షన్ ఎపిసోడ్‌ను నెవర్ బిఫోర్ అనేలా తెరకెక్కిస్తున్నాడు.

ఆగస్ట్ 15న రిలీజ్‌కు రెడీ అవుతుండటంతో.. శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. ఈ మూవీ తర్వాత భారీ లైనప్‌నే సెట్ చేసుకున్నాడు బన్నీ. మొత్తానికి పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటుతున్న బన్నీ.. బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌‌లో పాల్గొని తన ఇమేజ్‌ను మరింత పెంచుకుంటున్నాడు.