ALLU ARJUN Vs YASH: అల్లు అర్జున్ మీద ఫైర్ అవుతున్న కన్నడ స్టార్ ఫ్యాన్స్..

యశ్ మీద కానీ, కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ మీద కాని ఎలాంటి స్టేట్‌మెంట్లు ఇవ్వలేదు. అయినా తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూనే ఉన్నారు యశ్ ఫ్యాన్స్. దీంతో రంగంలోకి దిగిన అల్లు ఆర్మీ కౌంటర్ ఎటాక్ చేస్తోంది. సడన్‌గా సోషల్ మీడియాలో బన్నీ ఫ్యాన్స్ వర్సెస్ యశ్ ఫ్యాన్స్ అన్నట్టు సీన్ మారిపోయింది.

  • Written By:
  • Publish Date - November 10, 2023 / 07:43 PM IST

ALLU ARJUN Vs YASH: కన్నడ స్టార్ యశ్ (YASH) ఫ్యాన్స్ సడన్‌గా బన్నీ మీద ఫైర్ అవుతున్నారు. అసలు అల్లు అర్జున్ (ALLU ARJUN) ఎలాంటి కామెంట్ చేయలేదు. యశ్ మీద కానీ, కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ మీద కాని ఎలాంటి స్టేట్‌మెంట్లు ఇవ్వలేదు. అయినా తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూనే ఉన్నారు యశ్ ఫ్యాన్స్. దీంతో రంగంలోకి దిగిన అల్లు ఆర్మీ కౌంటర్ ఎటాక్ చేస్తోంది. సడన్‌గా సోషల్ మీడియాలో బన్నీ ఫ్యాన్స్ వర్సెస్ యశ్ ఫ్యాన్స్ అన్నట్టు సీన్ మారిపోయింది. సోషల్ మీడియాలో వివాదం భారీగా జరుగుతోంది. ఇప్పట్లో ఈ వివాదానికి బ్రేక్ పడేలా లేదు.

Pushpa 2 : పుష్ప – 2లో ఈ సారి ఊ అంటావా కు మించిన ఐటెం సాంగ్..

మొత్తానికి ఈ కాంట్రావర్సీకి కర్త, కర్మ, క్రియ అంతా బన్నీ తండ్రి అల్లు అరవిందే. టాప్ హీరోలకు సపోర్ట్ చేసే ప్రాసెస్‌లోనే యశ్‌ని చులకన చేయటం ఇప్పడు పెద్ద దుమారం అవుతోంది. అసలు కేజీయఫ్ 1, 2 (KGF) సినిమాలు రాకముందు యశ్ ఎవరు..? ఎవరికి తెలుసు.. అలాంటి సినిమా పడింది కాబట్టే యశ్ ఇప్పడు మనందరికి తెలుసు అన్నాడు. అంతేకాదు హీరోల రెమ్యునరేషన్ వల్ల కాదు, మేకింగ్, కంటెంట్ వల్లే బడ్జెట్ పెరుగుతుందని, అదే సినిమాను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళుతుందనే మీనింగ్ వచ్చేలా కామెంట్ చేయటంతో యశ్ ఫ్యాన్స్ సీరియస్ అయ్యారు. బన్నీ పుష్ప కంటే 4 రెట్లు వసూళ్లు రాబట్టింది కేజీయఫ్ 2 మూవీ. అలాంటి సినిమాలో యశ్ లేకపోతే ఇన్ని వసూళ్లు సాధ్యమా అని ఒక యశ్ ఫ్యాన్స్ అంటున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే అసలు 4 వందలకోట్లు రాబట్టిన పుష్ప విషయంలోనే బన్నీ అంత లెవల్ కొడుతున్నాడు.. అదే రూ.1200 కోట్లు రాబట్టిన కేజీయఫ్ హీరో యశ్ మాత్రం చాలా సింపుల్‌గా ఉంటాడని మరికొందరు ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు దమ్ముంటే.. బన్నీ తమ్ముడు శిరీష్‌ని పెట్టి వందల కోట్లతో పెద్ద సినిమా తీసి.. తనని యశ్‌లా గొప్పస్టార్‌గా మార్చండి అని మరి కొందరు అంటున్నారు. అల్లు అరవింద్ ఏదో హీరోల రెమ్యునరేషన్ పెద్ద విషయం కాదని చెప్పే ప్రాసెస్‌లో చేసిన కామెంట్ మిస్ ఫైర్ అయ్యింది. బన్నీకి ఈ విషయంతో ప్రమేయం లేకున్నా తన మీద కామెంట్ దాడి పెరగటం, సీన్‌లోకి బన్నీ ఆర్మీ రావటంతో ఇది చిలికి చిలికి తుఫాన్‌లా మారుతోంది.