దేవర మూవీ హిట్ అయినా, బ్లాక్ బస్టర్ అయినా, పాన్ ఇండియా ని షేక్ చేసినా సంతోషపడేది ఎవరంటే ముందుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్.. వాళ్లతో పాటు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ, అలానే నిర్మాత కూడా… ఇక హీరోయిన్ తోపాటు టెక్నీషియన్స్ కూడా సంతోష పడతారు.. కాని విచిత్రంగా ఈ సినిమాలో నటించకుండా, ఈ మూవీతో ఎలాంటి కనెక్షన్ లేకున్నా కూడా దేవర సక్సెస్ కోరుకుంటున్నాడు మరో హీరో అల్లు అర్జున్. దేవర హిట్ అయితే అందరికంటే ముందు బన్నీకే లాభమట… ఇక్కడ స్టోరీలో అదే పెద్ద ట్విస్ట్
దేవర రిజల్ట్ ఏమాత్రం కలిసొచ్చినా అది పుష్పరాజ్ కి ప్లస్ అవుతుంది. ఇక్కడే చిత్ర విచిత్రమైన లాజిక్ అల్లు ఆర్మీ కి కిక్ ఇస్తోంది… దేవర రిజల్ట్ కి బన్నీ ఫ్యూచర్ లో చేయబోయే సినిమాకి ఓ ఒక లింక్ కాదు రెండున్నాయి. అందులో మొదటి లింకు టిక్కెట్టు రేటు, నంబరాఫ్ షోస్ తాలూకు పర్మీషన్
దేవర టీం నిజంగా తెలంగాణ ప్రభుత్వంతో ముందుగా సంప్రదింపులు చేయటంలో, కాస్త డిలే చేయటం వల్లే తక్కువ షోలు, తక్కవు టిక్కెట్ రేట్ల పెంపు జరిగిందనంటున్నారు. ఐతే పుష్ప 2 రిలీజ్ కి ఇంకా 2 నెలల టైం ఉండటంతో, దేవర టీంకి ఎదురైన సమస్యని, ఇప్పటినుంచే సాల్వ్ చేసుకునే పనిలో పడింది సుకమార్ టీం.
దేవరకి పెరిగిన టిక్కెట్ రేట్లు, నంబరాఫ్ షోస్ వల్ల వచ్చే రెస్పాన్స్ బట్టి, పుష్ప 2 ని ప్లాన్ చేసుకోవటానికి బన్నీ టీంకి ఒక మంచి ఎగ్జాంపుల్ దొరికినట్టైంది. ఇదే కాకుండా పాన్ ఇండియా లెవల్ రిలీజ్ విషయంలో దేవర టీం కి మిస్ అయిన వాటిని పుష్ప టీం సర్ధుబాటు చేసుకునే ఛాన్స్ఉంది. సింపుల్ గా చెప్పాలంటే జాగ్రత్త పడేందుకు ఛాన్స్ఉంది.
ఇదికాకుండా దేవర హిట్ తో బన్నీకి కలిసొచ్చే రెండో అంశం… పాన్ ఇండియా లెవల్లో తనకి మరో మంచి ఆఫ్షన్ దొరకటం.. దేవర హిట్ అయితే పక్కగా కొరటాల శివతో బన్ని ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. పుష్ప 2 తర్వాత బన్నీ సినిమా చేద్దమన్నా ఆరేంజ్ ఉన్న దర్శకులెవరు అందుబాటులో లేరు. సందీప్ రెడ్డి , రాజమౌళి, ప్రశాంత్ నీల్ అంతా బిజీ… ఆట్లీతో అల్లు అర్జున్ కి లింక్ సింక్ అవ్వలేదు. దర్శకుడి రెమ్యునరేషనే ఇద్దరినీ పరేషాన్ చేసింది. ఇక సుకుమార్ పుష్ప 2 తర్వాత చరన్ తో సినిమా ప్లాన్ చేసుకున్నాడు
సో త్రివిక్రమ్ తో తీయటం తప్ప మరో ఆప్షన్ లేదనుకున్న టైంలో సీన్ లోకి కొరటాల శివ పేరొచ్చింది. గతంలోనే మరీ ముఖ్యంగా దేవర కంటే ముందు బన్నీతోనే కొరటాల శివ సినిమా ప్లాన్ చేశాడు. పుష్ప రిలీజ్ టైంలో పార్ట్ 2 ప్లాన్ చేయటంతో, కొరటాల శివ ప్రాజెక్ట్ సైడ్ కి వెళ్లింది. అదే కథ దేవరగా తీస్తున్నాడని అంతా అనుకుంటా కాదని తనే క్లారిటీ ఇచ్చాడు. అంటే బన్నీకి గతంలో చెప్పిన కథ అలానే ఉన్నట్టు…అదే జరిగి దేవర హిట్ అయితే, త్రివిక్రమ్ ని పక్కనపెట్టి కొరటాల శివతోనే బన్నీ సినిమా చేసే ఛాన్స్ ఉంది. అంతేకాదు పుష్ప తర్వాత వస్తోంది కాబట్టి పుష్ప2 హిట్ ముందే కన్ఫామ్ అయ్యింది. ఆతర్వాత మూవీ కూడా హిట్ అవ్వాలంటే, దేవర హిట్ అయితే ఆ క్రేజ్, ఇమేజ్ దర్శకుడికి ప్లస్ అవుతుంది. తనతో మూవీ చేస్తే, బన్నీకి ఇది బోనస్ బలంగా మారుతుంది. అందుకే దేవర హిట్ అవటం ఎన్టీఆర్ కే కాదు బన్నికి కూడా చాలా ముఖ్యమే..