ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప రాజ్‌గా ఇంకా పుష్ప సీక్వెల్ పనులతో బిజీ అయ్యాడు. ఆ తర్వాత పోలీస్‌గా మారి ముంబైని ఏలేందుకు ఫ్లైట్ ఎక్కబోతున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్‌ని పూర్తిగా ముంబైకే షిఫ్ట్ చేస్తున్నాడట. ముంబై నేపథ్యంలో కాప్ కాన్సెప్ట్‌తో అల్లు అర్జున్ కోసం కథని సిద్దం చేశాడట. గతంలో జులాయి వైజాగ్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చింది. ఖాలీగా ఉండే కుర్రాడిగా బన్నీని చూపించిన త్రివిక్రమ్, సన్నాఫ్ సత్యమూర్తి మూవీలో విలువలే ఆస్తిగా బతికే యువకుడిగా చూపించాడు.
అలా హైద్రాబాద్ బ్యాక్ డ్రాప్‌లో ఆమూవీ వస్తే, అల వైకుంఠపురంలో మాత్రం పిల్లల ఎక్స్‌ఛేంజ్ కాన్సెప్ట్‌తో ఏదో ప్రయోగం చేశాడు. ఇప్పుడు ముంబై పోలీస్ కమిషనర్‌గా మాఫియాతోఫైట్ చేసే పాత్రలో బన్నీని చూపించబోతున్నాడట. ఇవి లీకులో లేదంటే కావాలని టీమే వదిలిన ఫీలర్లో కాని.. బయట ప్రచారం మాత్రం బాగా పెరిగింది. పెద్ద హీరో, పెద్ద దర్శకుడు వీళ్లకి ఫీలర్స్‌ని వదలాల్సిన పనిలేదు. కాని తామే లీకులు లిచ్చి ఇలాంటి ఫీలర్స్ వదులుతున్నారంటే ఫ్యాన్స్‌ని మెంటల్ గా ప్రిపేర్ చేయటమే అంటున్నారు.
అప్పటి వరకు పుష్పరాజ్‌గా డాన్‌గా చూసిన జనం.. ఒక్కసారిగా తనని పోలీస్‌గా చూస్తారా..? ఈ వేగవంతమైన మార్పునకు అడ్జెస్ట్ అవుతారా అన్న డౌట్లొస్తాయి. కాబట్టే జనవరిలో సెట్స్ పైకెళ్లే ఈ ప్రాజెక్ట్ తాలూకు కొన్ని అంశాలను ఫిల్మ్ టీమే లీక్ చేస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.